Oscars 2021: వయసుతో సంబంధం లేదు
83 ఏళ్ల వయసులోనూ నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆంథోని హాప్కిన్స్కు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారం వరించింది. 1992లో ‘ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అకాడమీ...
అకాడమీ అవార్డు గెలుపొందిన ఆంథోని డోర్మెండ్
ఇంటర్నెట్‌డెస్క్: 83 ఏళ్ల వయసులోనూ నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆంథోని హాప్కిన్స్కు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారం వరించింది. 1992లో ‘ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు అందుకున్న ఆంథోని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అవార్డును ముద్దాడారు. ‘ది ఫాదర్’ చిత్రానికిగానూ ఆయన ఆస్కార్ గెలుచుకున్నారు. మరోవైపు 63 యేళ్ల ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్ ముచ్చటగా మూడోసారి ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకున్నారు.
83 ఏళ్ల వయసులో..
83 ఏళ్ల వయసులో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న నటుడు ఆంథోని హాప్కిన్స్. 1992లో ‘ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు ఆంథోని. ఆ తర్వాత పలు సార్లు ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నా పురస్కారం దక్కలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ‘ది ఫాదర్’ చిత్రంలో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వృద్ధుడి పాత్రలో ఆంథోని నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని నటనకు పలు అంతర్జాతీయ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్లు కూడా దక్కించుకున్నారు. ‘ది లయన్ ఇన్ ది వింటర్’, ‘హన్నీబాల్’, ‘రెడ్ డ్రాగన్’, ‘ది ఎలిఫెంట్ మ్యాన్’, ‘84 ఛార్జింగ్ క్రాస్ రోడ్’, ‘థోర్’, ‘నిక్సన్’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హాప్కిన్స్.
ముచ్చటగా మూడోసారి..
స్వేచ్ఛనిచ్చే తల్లిగా, వేధింపులకు గురైన భార్యగా, వ్యభిచారం చేసే మహిళగా, సంచార జీవితాన్ని గడిపే నోమ్యాడ్గా ...ఇలా ఎన్నో పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్. ఆమె తన 40 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఇప్పటికే రెండుసార్లు ఆస్కార్ ఉత్తమ నటి కిరీటం అందుకున్న ఆమె మూడోసారి సైతం విజయం సాధించారు. ఒక చోట స్థిరంగా ఉండకుండా సంచారం చేసే నోమ్యాడ్స్ నేపథ్యంతో తీర్చిదిద్దిన కథతో తెరకెక్కిన చిత్రం ‘నోమ్యాడ్ ల్యాండ్’. ఇందులో భర్తను కోల్పోయిన 61 ఏళ్ల ఫెర్న్ అనే మహిళ పాత్రలో అద్భుతంగా నటించారు ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్. ఈ చిత్రంలోని నటనకుగాను ఆమెకు 93వ ఆస్కార్ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ‘బ్లడ్ సింపుల్’, ‘ఆల్మోస్ట్ ఫేమస్’, ‘ది మ్యాన్ హు వాజ్ నాట్ దేర్’, ‘మిస్ పెట్రీగ్రూ లివ్స్ ఫర్ ఎ డే’, ‘మిసిసిప్పీ బర్నింగ్’, ‘నార్త్ కంట్రీ’, ‘లోన్ స్టార్’ తదితర చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు డోర్మెండ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్‌గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్‌గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్‌సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.. -
ఉదయనిధి బ్యానర్‌తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్‌తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్‌తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్‌తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కాలేజీ ఫెస్ట్‌లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
ఉత్తమ దర్శకుడిగా అజయ్ భూపతి.. సోషల్ మీడియాలో పోస్ట్
తాను ఉత్తమ దర్శకుడిగా ఎంపికైనట్లు అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అది ఏ అవార్డు అంటే? -
ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు.. ట్రోల్స్‌పై ఏమన్నారంటే..
నటి అవంతిక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. -
‘అఖండ2’ కాన్సెప్ట్ ఇదే.. హిట్ సినిమా సీక్వెల్‌పై బోయపాటి కామెంట్స్..
‘అఖండ2’లో సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ఉంటాయని బోయపాటి శ్రీను అన్నారు. -
‘యానిమల్’ మూవీ తమిళ వెర్షన్.. ఆడిటోరియం దద్దరిల్లే ఆన్సర్ ఇచ్చిన సందీప్‌రెడ్డి
‘యానిమల్’ మూవీ తమిళంలో తీస్తే సూర్య తన ఛాయిస్ అని దర్శకుడు సందీప్ అన్నారు. -
బికినీలో మాళవిక.. అరియానా అందాలు కేక
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోలు మీకోసం.. -
వరలక్ష్మి శరత్‌కుమార్ నిశ్చితార్థం.. విశాల్ ఏమన్నారంటే..?
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ (Vishal) స్పందించారు. -
ఎన్టీఆర్‌తో ఊర్వశి ఫొటో.. అందుకు క్షమాపణ చెప్పిన నటి
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటెల.. ఎన్టీఆర్‌తో సెల్ఫీ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
ఇది పక్కా సూపర్ హిట్: ‘పుష్ప 2’పై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). ఈ చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. -
శంకర్ కుమార్తె వివాహం.. సినీ తారల సందడి
ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya) వివాహం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!