Smriti Irani: ప్రెగ్నెంట్ అని తెలీదు.. షూట్ వల్ల అబార్షన్ అయ్యింది: స్మృతి ఇరానీ
నటిగా తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై స్పందించారు స్మృతి ఇరానీ (Smriti Irani). ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. అబార్షన్ అయినప్పటికీ షూట్‌కు వెళ్లినట్టు వెల్లడించారు.
ఇంటర్నెట్‌డెస్క్: రాజకీయాల్లోకి రాకముందు సినీ నటిగా ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టారు భాజపా నేత స్మృతి ఇరానీ (Smriti Irani). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నటిగా తనకు పేరు తెచ్చిపెట్టిన ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’, ‘రామాయణ్’ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సీరియల్స్‌లో నటిస్తోన్న రోజుల్లోనే తనకు అబార్షన్ అయ్యిందని చెప్పారు.
‘‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’.. నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ సీరియల్ టైమ్‌లోనే నేను ప్రెగ్నెంట్‌ని అయ్యాను. అయితే ఆ విషయం నాకు తెలియలేదు. ఓ రోజు షూట్ చేస్తున్నప్పుడు నీరసంగా అనిపించింది. ఓపిక లేదని, ఇంటికి వెళ్లిపోతానని అడిగాను. కానీ, వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల చేసేది లేక సాయంత్రం వరకూ సెట్‌లోనే ఉన్నాను. ఆరోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లగా అబార్షన్ అయినట్లు తెలిసింది. ఎంతో కుంగుబాటుకు గురయ్యాను. షూట్ నుంచి కాస్త విరామం తీసుకుందామనుకున్నప్పటికీ ఇంటి ఈఎంఐలు, ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్‌కు వెళ్లాను. నాకసలు అబార్షన్ కాలేదని, అబద్ధం చెబుతున్నానంటూ ఓ వ్యక్తి వదంతులు పుట్టించాడు. అలాంటి సమయంలో నేను చెప్పింది నిజమని నమ్మించడం కోసం రిపోర్టులు తీసుకువెళ్లి.. ఆ ప్రోగ్రామ్ క్రియేటర్ ఏక్తాకపూర్‌కు చూపించాను’’
‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా సంపాదన రూ.1800. నా వివాహ సమయంలో మా వద్ద రూ.30,000 మాత్రమే ఉంది. ఎలాంటి కార్లు, స్కూటర్లు లేవు. ఎక్కడికి ప్రయాణించాలన్నా ఆటోలోనే వెళ్లేదాన్ని. అది చూసి నా మేకప్ ఆర్టిస్ట్ ఇబ్బందిగా ఫీలయ్యాడు. ‘మేడమ్ నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఒక కారు తీసుకోండి’ అని నాతో చెప్పాడు’’ అంటూ స్మృతి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో