సోషల్‌ లుక్‌: శుభవార్త చెప్పిన రామచిలుక

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ బెల్లీ డ్యాన్స్‌ చేసింది. బురిటో బెల్లీ డ్యాన్స్‌ సెషన్లు మిస్‌ అవుతున్నా అంటూ తాను డ్యాన్స్‌ చేస్తున్న వీడియో పోస్టు చేసింది. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ‘బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌’ అంటూ చరణ్‌ తన భుజంపై వాలిన రామచిలకతో మాట్లాడుతున్నట్లుగా..

Updated : 08 Dec 2022 17:04 IST

తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ బెల్లీ డ్యాన్స్‌ చేసింది. బురిటో బెల్లీ డ్యాన్స్‌ సెషన్లు మిస్‌ అవుతున్నా అంటూ తాను డ్యాన్స్‌ చేస్తున్న వీడియో పోస్టు చేసింది.

* మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ‘బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌’ అంటూ చరణ్‌ తన భుజంపై వాలిన రామచిలుకతో మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను పోస్టు చేశారు.

* ‘డిక్టేటర్‌’లో బాలయ్య సరసన నటించిన ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్‌ గుర్తుందా..? తన మీద వచ్చిన మీమ్స్‌ చూసిన తర్వాత తన పరిస్థితి ఇదే అంటూ పగలబడి నవ్వుతున్న ఫొటోను పంచుకుందామె.

* రసం.. రైస్‌ అంటే ఇష్టమని అంటోంది బాలీవుడ్‌ భామ దీపిక పదుకొణె. మరి మీకు ఇష్టమైన భోజనం ఏంటని ప్రశ్నిస్తూ.. ఓ చిన్న వీడియోను పోస్టు చేసిందామె.










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని