Social Look: ‘ఢీ’ స్టిల్‌ రిపీట్‌ చేసిన విష్ణు- జెనీలియా.. పాయల్‌కు క్యాప్షన్‌ కావాలట!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 23 May 2022 01:39 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

📸 తాము నటించిన ‘ఢీ’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ అదే స్టైల్‌లో ఫొటోకి పోజిచ్చారు మంచు విష్ణు- జెనీలియా. ఈ పిక్‌ను అభిమానులతో పంచుకుంటూ ‘మా అనుబంధంలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని’ విష్ణు పేర్కొన్నారు.

📸 ‘క్యాప్షన్‌ పెట్టండి’ అంటూ తన ఫొటోని షేర్‌ చేసింది పాయల్‌ రాజ్‌పుత్‌.

📸 అట్లాంటాలో ఓ వాహనాన్ని నడిపింది ప్రియాంక చోప్రా. తన భర్త నిక్‌ జొనాస్‌ తీసిన ఫొటోని పోస్ట్‌ చేసింది.

📸 ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తమ కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు శ్రేయా ఘోషల్‌ దంపతులు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..






























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని