Social Look: నయన్‌-విఘ్నేశ్‌ వెడ్డింగ్‌ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 10 Aug 2022 02:12 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* నిఖిల్‌, అనుపమ జంటగా నటించిన చిత్రాల్లో ‘కార్తికేయ 2’ ఒకటి. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా నిఖిల్‌, అనుపమ విజయవాడ వెళ్లారు. ప్రయాణానికి సంబంధించిన దృశ్యాల్ని అనుపమ షేర్‌ చేసింది.

* నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ల వివాహ డాక్యుమెంటరీ త్వరలోనే ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా సంబంధిత ప్రోమో మంగళవారం విడుదలైంది. నయన్‌, విఘ్నేశ్‌ తమ ప్రేమను చాటుకున్నారు.

* ట్రాఫిక్‌లో చిక్కుకుందట సంయుక్తా మేనన్‌. ఆ సమయంలోనే సెల్ఫీ తీసుకున్నానంటూ చెప్పుకొచ్చింది.

* వర్ష బొల్లమ్మ ఆకుపచ్చ రంగు డ్రెస్సు ధరించింది. తన ఫొటోలని పంచుకుంటూ ‘పచ్చందనమే పచ్చదనమే’ (సఖి) పాటని గుర్తు చేసుకుంది.

*  ‘మీరు నమ్మకంగా ఉంటే అందంగా ఉన్నట్టే’ అని అంటోంది నైనా గంగూలీ.



























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని