పరిణీతి సెల్ఫీ.. జ్ఞాపకాల్లో ప్రియాంక.. రకుల్‌ మోటివేషన్‌

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బ్లాక్‌ అండ్‌ బ్లాక్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు రణ్‌వీర్‌. 

Published : 22 Mar 2021 01:57 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మీరు గెలుస్తారు లేదా నేర్చుకుంటారు అంతేకానీ ఎప్పటికీ ఓడిపోరు’ అంటూ స్ఫూర్తినిచ్చే విషయాలు చెప్పుకొచ్చింది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘సండే థాట్స్‌’ పేరిట ఓ ఫొటోను పంచుకుంటూ ఈ వ్యాఖ్యను జోడించింది. 

* ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో బ్లాక్‌ అండ్‌ బ్లాక్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారాయన. 

* సెల్ఫీకి పోజిస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది కథానాయిక పరిణీతి చోప్రా. ‘నన్ను వాళ్లు ఒంటరిగా వదిలేశారు అందుకే ఇలా’ అంటూ సరదాగా రాసుకొచ్చింది.

* గతంలో నిక్‌ జొనాస్‌తో ఐస్‌లాండ్‌లో చేసిన సందడిని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా. 2019లో అక్కడ దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.
 

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని