
14 ఏళ్ల ‘మున్నా’.. కీర్తి సురేశ్ సంతోషం
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: తన సోదరి రేవతి సురేశ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు నాయిక కీర్తి సురేశ్. ‘మరక్కర్’ సెట్లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారామె. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది.
* 1980లో వరల్డ్ టూర్‌కి వెళ్లారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈఫిల్ టవర్ (పారిస్) వద్ద దిగిన ఇళయరాజా ఫొటోని ఆయన తనయుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
* ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మున్నా’ చిత్రం 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ‘14 సంవత్సరాల క్రితం నా తొలి చిత్రం విడుదలైంది. మున్నా ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’ అని ఈ సందర్భంగా తెలియజేశారు వంశీ.
* భౌతిక దూరం పాటించండి.. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి అంటూ ఓ ఫొటోని షేర్ చేశారు యువ నటుడు శ్రీ విష్ణు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.