
చాందిని ‘కలర్ ఫోటో’ .. సాయి తేజ్ సీరియస్
Social Look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: ‘కలర్ ఫోటో’ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది నటి చాందిని చౌదరి. సుహాస్, చాందిని జంటగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది విడుదలైంది.
* తాను కీలక పాత్ర పోషించిన ‘ఏక్ మినీ కథ’ చిత్ర ట్రైలర్ మే 21న విడుదలతుందని తెలియజేసింది శ్రద్ధాదాస్. శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 27న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
* కథానాయకుడు నాని సోదరి పుట్టిన రోజు నేడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారాయన.
* చేత్తో రాయిని పట్టుకుని సీరియస్ లుక్‌లో ఉన్న తన ఫొటోని షేర్ చేశాడు యువ కథానాయకుడు సాయి తేజ్.
* ‘ప్రశాంతంగా ఉండండి.. మీరు పెంచుకుంటోన్న కుక్కని హగ్ చేసుకోండి’ అని అంటోంది ఛార్మి. తను పెంచుకుంటోన్న కుక్కతో దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యను జోడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.