అనుప‌మ అల్ల‌రి.. వ‌ర‌ల‌క్ష్మి జిమ్   

న‌వ్వుతూ.. నడుస్తూ..  ఫొటోల‌కు పోజిచ్చింది తెలుగ‌మ్మాయి అన‌న్య నాగ‌ళ్ల‌. మ‌ల్లేశం, వ‌కీల్ సాబ్ చిత్రాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఆ ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకుంది.

Published : 30 May 2021 01:30 IST

social look‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: జిమ్‌ని మిస్ అవుతున్నా అంటూ గ‌తంలో జిమ్ చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. మీరెక్క‌డున్నా ఆరోగ్యంగా ఉండండి. మాస్క్ ధ‌రించండి. వ్యాక్సిన్ వేయించుకోండి అని కోరింది.

* ‘వ‌కీల్ సాబ్’ ఒరిజిన‌ల్ సౌండ్ ట్రాక్ (ఓఎస్టీ) అద్భుతంగా వ‌చ్చింద‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తెలియ‌జేశారు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీరామ్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది.

* త‌న సోద‌రుడు అక్ష‌య్ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో క‌లిసి అల్ల‌రి చేసింది యువ నాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఆ సంతోషాన్ని ఫొటోల్లో బంధించి అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో అనుప‌మ‌ని ఎత్తుకుని కనిపించాడు అక్ష‌య్‌.

* న‌వ్వుతూ.. నడుస్తూ..  ఫొటోల‌కు పోజిచ్చింది తెలుగ‌మ్మాయి అన‌న్య నాగ‌ళ్ల‌. మ‌ల్లేశం, వ‌కీల్ సాబ్ చిత్రాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఆ ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకుంది. ఇంకా ఎవ‌రెవ‌రు ఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి...
 


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని