Keerthy Suresh: నాది ఐరన్‌ లెగ్‌ అన్నారు

ఓ కొత్త కథానాయిక తెరపై మెరిసిందంటే చాలు.. ఆ చిత్ర ఫలితాన్ని బట్టి వారిపై ఓ ముద్ర పడిపోతుంది. తొలి అడుగుల్లోనే వరుస విజయాలు దక్కాయంటే సరేసరి.. లేదంటే హిట్టు మాట వినిపించే వరకు ‘ఐరన్‌ లెగ్‌’ అన్న ముద్ర మోసుకుతిరగాల్సిందే. ఇప్పుడు చిత్రసీమలో స్టార్‌ నాయికలుగా

Updated : 29 Jan 2022 07:11 IST

- కీర్తి సురేష్‌

ఓ కొత్త కథానాయిక తెరపై మెరిసిందంటే చాలు.. ఆ చిత్ర ఫలితాన్ని బట్టి వారిపై ఓ ముద్ర పడిపోతుంది. తొలి అడుగుల్లోనే వరుస విజయాలు దక్కాయంటే సరేసరి.. లేదంటే హిట్టు మాట వినిపించే వరకు ‘ఐరన్‌ లెగ్‌’ అన్న ముద్ర మోసుకుతిరగాల్సిందే. ఇప్పుడు చిత్రసీమలో స్టార్‌ నాయికలుగా వెలుగులీనుతున్న పలువురు నాయికలు కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొన్న వారే. ఇందుకు తాను కూడా మినహాయింపు కాదంటోంది నటి కీర్తి సురేష్‌. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా ‘ఐరన్‌ లెగ్‌’ అన్న ట్యాగ్‌ను మోయాల్సి వచ్చిందని చెప్పింది. ‘‘నాయికగా నా సినీ ప్రయాణం మలయాళ చిత్రసీమ నుంచి మొదలైంది. నా తొలి చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన కొద్దిరోజులకే అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. ఇలా నా సినిమాలన్నీ మధ్యలోనే ఆగిపోవడంతో కొంతమంది నాపై ‘ఐరన్‌ లెగ్‌’ ముద్రవేశారు. ‘ఆ కొత్తమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుంద’ని ప్రచారం చేశారు. ఆ సమయంలో కాస్త బాధగా అనిపించినా.. వాటిని పట్టించుకోకుండా నా పని చేస్తూ ముందుకెళ్లాను. ఆ తర్వాత నా పని తీరే నాకు విజయాన్ని అందించింది. దాంతో నాపై వచ్చిన విమర్శలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి’’ అని కీర్తి చెప్పింది. ఆమె నటించిన ‘గుడ్‌లక్‌ సఖి’ ఇటీవలే విడుదలైంది. ఇక తెలుగులో మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’, చిరంజీవితో ‘భోళా శంకర్‌’ చిత్రాల్లో నటిస్తోంది కీర్తి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని