కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్‌.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ

అనతికాలంలోనే దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించాడు యువ నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda). సాధారణమైన ఆహార్యంతో, సహజమైన  ప్రవర్తనతో బీటౌన్‌లోనూ విశేషంగా అభిమానాన్ని చూరగొంటున్నాడు. హిందీలో ఒక్క సినిమా కూడా విడుదలవ్వకుండానే...

Published : 12 Aug 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనతికాలంలోనే దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించాడు యువ నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda). సాధారణమైన ఆహార్యంతో, సహజమైన  ప్రవర్తనతో బీటౌన్‌లోనూ విశేషంగా అభిమానాన్ని చూరగొంటున్నాడు. హిందీలో ఒక్క సినిమా కూడా విడుదలవ్వకుండానే ఇంతటి స్టార్‌డమ్ ని సంపాదించిన ఈ యంగ్‌ హీరో తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’(Liger) ప్రచారంలో భాగంగా విజయ్‌ ముంబయిలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొన్ని సార్లు నోరు మూసుకుని ఉండటం చాలా ఉత్తమం అనిపిస్తోంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏదైన విషయం గురించి ప్రశ్నిస్తే దానిపై చాలా ఎక్కువగా మాట్లాడేవాడిని. కాని ఇప్పుడు అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి ప్రశ్నల విషయంలో నాపై కొందరు ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని ఉంటారు. నేను కొత్తగా చెప్పిన నిజాలు వారి అభిప్రాయాన్ని ఏ మాత్రం మార్చవని తెలుసు. అందుకే తక్కువగా మాట్లాడటం, నోరు విప్పకుండా ఉండటమే మంచిదని నమ్ముతున్నా. ఇండస్ట్రీకి వచ్చినపుడు నా వ్యక్తిగత ధోరణి ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఎటువంటి మార్పు లేదు’ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించాడు. విజయ్‌ దేవరకొండ, అనన్యపాండే (Ananya Panday) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ ఆగష్టు25న విడుదల కానుంది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకుడు. విజయ్‌ తల్లిగా రమ్యకృష్ణ (Ramya Krishna) నటించారు. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌ టైసన్‌(Mike Tyson) ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ‌ప్రచార చిత్రాలు, ట్రైలర్, పాటలు అభిమానుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని