Son Of India: ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మోహన్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఓటీటీలోకి వచ్చేసింది.

Updated : 20 May 2022 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌బాబు (Mohan Babu) ప్రధాన పాత్రలో నటించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ (Son Of India) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video)లో మంగళవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రాన్ని దర్శకుడు డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించారు. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలోని మోహన్‌బాబు లుక్స్‌, దేశం గురించి ఆయన చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి.

క‌థేంటంటే: క‌డియం బాబ్జీ (మోహ‌న్‌బాబు) ఓ డ్రైవ‌ర్‌. ఎన్‌.ఐ.ఎ అధికారిణి ఐరా (ప్ర‌గ్యా జైశ్వాల్‌) ద‌గ్గ‌ర ప‌నిచేస్తుంటాడు. కేంద్ర‌మంత్రి మ‌హేంద్ర భూప‌తి (శ్రీకాంత్‌)తోపాటు మ‌రో ఇద్ద‌రు కిడ్నాప్ అవుతారు. ఆ  కేస్‌ని ఛేదించ‌డం కోసం రంగంలోకి దిగుతుంది ఐరా నేతృత్వంలోని ఎన్‌.ఐ.ఎ బృందం. ఆ మూడు కిడ్నాప్‌ల‌కి సూత్ర‌ధారి బాబ్జీనే అని తేలుతుంది. బాబ్జీ అస‌లు రూపం కూడా అది కాదు. అత‌ని అస‌లు పేరు విరూపాక్ష‌. ప‌ద‌హారేళ్లు జైలు జీవితాన్ని గ‌డిపిన ఓ వ్య‌క్తి. ఇంత‌కీ విరూపాక్ష గ‌త‌మేమిటి? అత‌ను కిడ్నాప్‌ల‌కి పాల్ప‌డ‌టానికి కార‌ణ‌మేంటి? అన్నది మిగతా కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని