Sonakshi Sinha: ఇకపై హాస్పిటల్‌కు వెళ్లం: ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి సిన్హా

ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి స్పందించారు. పెళ్లి తర్వాత జీవితంపై ఆమె మాట్లాడారు.

Updated : 06 Jul 2024 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. అలాగే కొన్నిరోజులుగా తనపై వస్తోన్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించారు. తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటి గురించి మాట్లాడారు.

‘పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. జీవితం ఇంతకంటే అందంగా, గొప్పగా ఉండదేమో అనిపిస్తోంది. ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. మళ్లీ నా సినిమాల చిత్రీకరణను ప్రారంభించడం సంతోషంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏంటంటే.. ఇకపై మేము హాస్పిటల్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్‌ అని అనుకుంటున్నారు. ఇదొక్కటే ఆలోచనలో ఉంటున్నారు’ అని చెప్పారు. సోనాక్షి (Sonakshi Sinha) తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన్ని పరామర్శించడం కోసం సోనాక్షి అక్కడకు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఆమెపై ఈ రూమర్స్ మొదలయ్యాయి.

అనంత్‌ - రాధికా సంగీత్‌.. మెరిసిన బాలీవుడ్‌ తారలు

సోనాక్షి సిన్హా- జహీర్‌ ఇక్బాల్‌ జూన్‌ 23న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లిపై వచ్చిన ట్రోలింగ్‌ను కూడా సోనాక్షి తిప్పికొట్టారు. ‘ప్రేమే పెద్ద మతం’ అంటూ ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. వీరిద్దరూ కలిసి ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని