
Sonakshi Sinha: ఏవండోయ్ సోనాక్షి గారూ పెళ్లెప్పుడు?
ముంబయి: కరోనా కారణంగా పలువురు సినీ తారలు వ్యక్తిగత, కుటుంబ జీవితంపై దృష్టి పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు కత్రినాకైఫ్, వరుణ్‌ధావన్, రాజ్‌కుమార్ రావు సింగిల్ జీవితానికి ఫుల్స్టాప్ పెట్టేసి.. తమ కిష్టమైన వారితో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నటి సోనాక్షి సిన్హాకు ఓ నెటిజన్ పెళ్లి గురించి ఉచిత సలహా ఇచ్చారు. దానిపై స్పందించిన ఆమె వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.
నటి సోనాక్షి సిన్హా తాజాగా ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తాను చేయనున్న ప్రాజెక్ట్‌లపై స్పందించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ‘‘సోనాక్షి మేడమ్.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీరెప్పుడు చేసుకుంటారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘అందరికీ కొవిడ్ వస్తోంది. నాక్కూడా రావాలా?’’ అని ఆమె సమాధానమిచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.