Sonali Bendre: అభిమాని సూసైడ్‌.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి

అభిమానులు చేసే కొన్ని పనులు తనను బాధిస్తాయని నటి సోనాలి బింద్రే అన్నారు. గతంలో జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడారు.

Published : 17 Jun 2024 13:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి సోనాలి బింద్రే (Sonali Bendre). కొంతకాలం నటనకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్‌ కల్చర్‌ గురించి మాట్లాడారు. 

సోనాలిని చూడలేకపోయినందుకు గతంలో ఓ అభిమాని చెరువులో దూకి సూసైడ్‌ చేసుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఆ సంఘటనను ఇంకా నమ్మలేకపోతున్నానన్నారు. ‘ఇప్పటివరకు నాకు ఈ విషయం తెలియదు. అభిమాన హీరోయిన్‌ను చూడలేకపోయినందుకు ప్రాణాలు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయం. నాకు కొన్ని మెయిల్స్‌, ఉత్తరాలు వచ్చేవి. కొందరు వాటిని రక్తంతో రాసేవారు. అవి చూసి ఆశ్చర్యపోయేదాన్ని. చాలా బాధేసేది. అభిమానించడం తప్పు కాదు. కానీ ఇలా చేయడం తప్పు. మనుషులు తమలాంటి మరో వ్యక్తి కోసం ఎందుకు ఇంతలా తాపత్రయపడతారో నాకు అర్థం కాదు. నేను ఎవరినీ ఈ స్థాయిలో అభిమానించలేదు’ అని చెప్పారు.

దర్శన్‌పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?

మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించిన సోనాలి.. 19 ఏళ్ల వయసులో ‘ఆగ్’ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు అందుకొని స్టార్‌గా ఎదిగారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ సీజన్‌ 2తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పలు డ్యాన్స్‌ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని