Sonali Bendre: తన సినిమాలో నేను నటించడం లేదు.. అదంతా రూమర్‌: సోనాలి బింద్రే

ఒకప్పుడు స్టార్‌ కథానాయకులతో ఆడిపాడిన నటి సోనాలి బింద్రే. 2018లో క్యాన్సర్‌ బారిన పడి మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి కోలుకుంది.

Published : 30 May 2022 19:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు స్టార్‌ కథానాయకులతో ఆడిపాడిన నటి సోనాలి బింద్రే. 2018లో క్యాన్సర్‌ బారిన పడి మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి కోలుకుంది. తాజాగా ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది జూన్‌10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సోనాలి గురించి ఒక రూమర్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న తర్వాత చిత్రంలో సోనాలి కీలక పాత్రలో కనిపించనుందన్న వార్త తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీని పై సోనాలి ఆశ్చర్యకరంగా స్పందించారు. మీరు ఎన్టీఆర్‌ సినిమాలో నటిస్తున్నారటగా ..అని ఓ ఇంటర్వ్యూలో సోనాలిని అడగ్గా..  ‘ఎవరూ? నేనా..! లేదు. నాకసలు ఈ విషయం తెలీదు. నాకు మీరు మాట్లాడే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇది కచ్చితంగా రూమర్‌ అంతే’. అని సమాధానం ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని