Sonali Bendre: క్యాన్సర్‌ నుంచి పాఠాలు నేర్చుకున్నాను: సోనాలి బింద్రే

ఒకప్పుడు స్టార్‌ కథానాయికగా అగ్రహీరోలందరితో ఆడిపాడిన నటి సోనాలి బింద్రే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఈ స్టార్‌ హీరోయిన్‌ 2018లో మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే.

Published : 25 May 2022 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు స్టార్‌ కథానాయికగా అగ్రహీరోలందరితో ఆడిపాడిన నటి సోనాలి బింద్రే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఈ హీరోయిన్‌ 2018లో మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి బయటకు వచ్చి ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. క్యాన్సర్‌తో తను చేసిన పోరాటాన్ని, తన జీవితాన్ని అది ఎలా మార్చేసిందో ఇటీవల సోనాలి గుర్తు చేసుకున్నారు. ‘క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్న వారి జీవితాలు.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్‌కి తర్వాత అన్నట్లు ఉంటాయి. మనిషి తన జీవితంలో ఏదో ఒక దాని వల్ల పాఠాలు నేర్చుకోవాలి.  నేను దీని(క్యాన్సర్‌) నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నానని భావిస్తున్నాను. ఇది లక్ష్యం కాదు. ఇది ఒక ప్రక్రియ మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు కృతజ్ఞతతో ఉన్నాను. ట్రీట్‌మెంట్‌ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ. నేను ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్యులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను ఇంటికి పంపుతామని చెప్పారు’ అంటూ సోనాలి తన ట్రీట్‌మెంట్‌ రోజులను గుర్తుచేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని