Sonali Bendre: దక్షిణాది.. ఉత్తరాది కాదు.. మనమంతా భారతీయులం: సోనాలీ బింద్రే

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గత కొన్నిరోజుల నుంచి సాగుతోన్న సౌత్‌ వర్సెస్‌ నార్త్‌ మూవీస్‌ అనే చర్చపై ప్రముఖ నటి సోనాలీ బింద్రే స్పందించారు. నటిగా కెరీర్‌ని ప్రారంభించిన కొత్తలో దక్షిణాది, ఉత్తరాదిల్లోని స్టార్‌ హీరోల సరసన నటించిన ఆమె..

Published : 09 Jun 2022 01:13 IST

ముంబయి: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గత కొన్నిరోజుల నుంచి సాగుతోన్న సౌత్‌ వర్సెస్‌ నార్త్‌ మూవీస్‌ అనే చర్చపై ప్రముఖ నటి సోనాలీ బింద్రే స్పందించారు. నటిగా కెరీర్‌ని ప్రారంభించిన కొత్తలో దక్షిణాది, ఉత్తరాదిల్లోని స్టార్‌ హీరోల సరసన నటించిన ఆమె.. అనారోగ్య కారణాల రీత్యా కొన్నేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్నారు. ఈక్రమంలోనే తాజాగా ఆమె బుల్లితెర వేదికగా ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె ముఖ్య భూమిక పోషించిన ‘ది బ్రోకన్‌ న్యూస్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘నాకు తెలిసినంత వరకూ ఇప్పుడు వస్తోన్న సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతో అలరిస్తున్నాయి. కథలు బాగుండబట్టే సినిమాలు అంతగా ఆడుతున్నాయి. కథ ఒక్కటే కాదు, ఇతర చిత్రబృందం, నటీనటులు అందరూ కష్టపడినప్పుడే ఫలితం మంచిగా వస్తుంది. ఉదాహరణకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’నే తీసుకుంటే.. సినిమా కోసం తారక్‌, రామ్‌చరణ్‌ ఎంతో కష్టపడ్డారు. ప్రస్తుతం ఆసినిమా సక్సెస్‌ని వాళ్లందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. దక్షిణాది, ఉత్తరాది అనే డిబెట్‌ని పక్కనపెడితే మనందరం భారతీయులం. ఏదైనా కొత్త సినిమా మంచి విజయం అందుకున్నప్పుడు మనం కూడా దాని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ప్రేక్షకుల సందడితో థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. దాన్ని మనం సెలబ్రేట్‌ చేసుకోవాలి’’ అని సోనాలి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని