సోనమ్‌ సొగసులు

సోనమ్‌ కపూర్‌ అనగానే టక్కున గుర్తొచ్చేది స్టైల్‌, ఫ్యాషన్‌. బయటికి వచ్చినా, ఎలాంటి వేడుకల్లో పాల్గొన్నా కొత్తగా మెరిసిపోతుంది సోనమ్‌. చిత్రవిచిత్రమైన ఆహార్యంతో ఔరా అనిపించేలా....

Published : 12 Apr 2021 11:09 IST

ముంబయి: సోనమ్‌ కపూర్‌ అనగానే టక్కున గుర్తొచ్చేది స్టైల్‌, ఫ్యాషన్‌. బయటికి వచ్చినా, ఎలాంటి వేడుకల్లో పాల్గొన్నా కొత్తగా మెరిసిపోతుంది సోనమ్‌. చిత్రవిచిత్రమైన ఆహార్యంతో ఔరా అనిపించేలా ముస్తాబైన సందర్భాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్‌ స్టైల్‌ ఐకాన్‌గా పేరొందిన ఈ ‘నీర్జా’ నాయిక తాజాగా ధరించిన ఓ డ్రెస్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చెట్టు వేర్లు, ఊడలను పోలినట్టు ఉన్న ఈ డ్రెస్‌ని డచ్‌కి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ రూపొందించారు. ఈ దుస్తులు ధరించి సోనమ్‌ మురిసిపోతూ ఆ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రతిభను పొగిడేస్తూ ట్వీట్‌ కూడా చేసింది. సోషల్‌మీడియాలో ఈ ఫొటోలు బాగా సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం సోనమ్‌ ‘బ్లైండ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని