Updated : 19 Aug 2022 07:05 IST

Dhamaka: దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది

‘నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది.. గుండె గట్టిగా కొట్టేసుకుంటాది...’ అని కథానాయిక అంటే! ‘నన్ను చూస్తే అట్నే ఉంటాది... దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది...’ అని కథానాయకుడు చెబుతుంటే...! ఏమవుతుంది? ‘ధమాకా’ (Dhamaka) చిత్రంలోని పాటవుతుంది. రవితేజ (Raviteja), శ్రీలీల (Sri Leela) జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఈ పాటను గురువారం విడుదల చేశారు. భీమ్‌ సిసిరోలియో సంగీతం అందించి, మంగ్లీతో కలసి ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించగా, శేఖర్‌ వీజే నృత్యాలు సమకూర్చారు. ‘‘మాస్‌ను అలరించేలా సాగే ఈ పాట... అందర్నీ ఆకట్టుకుంటుంది. రవితేజ, శ్రీలీల డ్యాన్స్‌లు అభిమానులను అలరిస్తాయి’’ అని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే ప్రసన్నకుమార్‌ బెజవాడ అందిస్తుండగా... త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు వేగంగా సాగుతున్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని