ఆ చిన్నారుల కోసం సోనూసూద్‌ విమానం

కరోనా వైరల్‌, లాక్‌డౌన్‌ సమయంలో వేలమందికి సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ ఆంక్షలు దాదాపుగా

Published : 14 Aug 2020 14:35 IST

ముంబయి: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సమయంలో వేలమందికి సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ ఆంక్షలు దాదాపుగా సడలిపోయినా ఇప్పటికీ ఆయన నుంచి ఎవరో ఒకరు సాయం పొందుతూనే ఉన్నారు. ట్విటర్‌ వేదికగా ఆయనకు అర్జీ పెట్టుకోవడమే ఆలస్యం తన చేతనైనంత సాయం చేస్తున్నారు. తాజాగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరమైన 39మంది చిన్నారుల కోసం ఫిలిప్సీన్స్‌ నుంచి దిల్లీకి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

లివర్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్న 39మంది చిన్నారులకు దిల్లీలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అయితే, వారంతా ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయాన్ని ట్విటర్‌ వేదికగా సోనూసూద్‌కు విన్నవించగా, ‘ఈ అమూల్యమైన జీవితాలను కాపాడుదాం. మరో రెండు రోజుల్లో వాళ్లు ఇండియాకు వస్తారు. 39 ఏంజెల్స్‌ మీరు మీ బ్యాగ్‌లు సర్దుకోండి’ అని సోనూ సమాధానం ఇచ్చారు. దీంతో మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్ల ఆయన సాయాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇదే కాదు.. వైద్యం అవసరమైన మరో వ్యక్తి, చదువుకోవడానికి యూపీఎస్‌ఈ పుస్తకాలు కావాలంటూ ట్వీట్‌ చేసిన విద్యార్థికి ఇలా ఒకరి తర్వాత ఒకరికి సోనూ సాయం చేస్తూనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని