మహారాష్ట్ర పోలీసులకు సోనూ ఫేస్‌షీల్డ్స్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిందే. అలాంటి వారికి నటుడు సోనూ సూద్‌ బాసటగా నిలిచాడు. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాడు. ఇందుకోసం సోనూ

Published : 18 Jul 2020 00:08 IST

ముంబయి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిందే. అలాంటి వారికి నటుడు సోనూ సూద్‌ బాసటగా నిలిచిన విషయమూ విదితమే. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాడు. ఇందుకోసం సోనూ రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఇటీవల లాక్‌డౌన్‌ నేపథ్యంలో మరణించిన, గాయపడిన 400 వలస కార్మికుల కుటుంబాల బాధ్యత తాను తీసుకొని గొప్ప మనసు చాటుకున్నాడు. తాజాగా మరోసారి సోనూ తన ఉదారత చూపించాడు. మహారాష్ట్ర పోలీసుల కోసం కరోనా సోకకుండా ఉపయోగించే 25వేల ఫేస్‌షీల్డ్స్‌ను విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సోనూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను కలిశారు. ఇద్దరు కలిసిన దిగిన ఫొటోను హోంమంత్రి అనిల్ ట్విటర్‌లో పోస్టు చేసి సోనూ సాయం గురించి వెల్లడించారు. అతడికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘మహారాష్ట్ర పోలీసుల కోసం 25వేల ఫేస్‌షీల్డ్స్‌ ఇచ్చి ఉదార సహకారాన్ని అందించిన సోనూసూద్‌కు ధన్యవాదాలు’’అని ట్వీట్‌ చేశారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా వలస కార్మికులను ఇళ్లకు చేర్చడంలో సోనూ ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలతో ఓ పుసక్తం రాయాలన్న యోచనలో ఉన్నట్లు సోనూ ఇది వరకు తెలిపారు. ‘‘నేను ముంబయి నగరానికి వచ్చింది ఇలా సాయం చేయడానికేనని నమ్ముతున్నాను. వలస కార్మికులకు సాయం చేయగలిగే శక్తినిచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. ముంబయి నగరం తర్వాత యూపీ, బిహార్‌, ఝార్ఖండ్‌, అసోం, ఉత్తరాఖండ్‌లోని ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అక్కడి వారితో నాకు స్నేహం ఏర్పడింది. ఈ అనుభవాలను ఓ పుస్తకంగా మార్చాలని నిర్ణయించుకున్నా.’’అని సోనూ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని