Sonu sood: చెప్పులు బేరమాడిన నటుడు సోనూ.. డిస్కౌంట్‌ ఎంతంటే?

బాలీవుడ్‌ స్టార్‌ సోన్‌సూద్‌ విధి వ్యాపారితో చెప్పులను బేరం ఆడుతూ మరోసారి వార్తల్లో

Published : 07 Aug 2021 01:36 IST

శ్రీనగర్‌: నటుడు సోనూసూద్‌ మరోసారి సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో సందడి చేశారు. వీధి వ్యాపారితో చెప్పులను బేరం ఆడుతూ సోనూ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల అండగా నిలిచి ప్రజాభిమానం చూరగొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల సోనూసూద్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం జమ్మూ-కశ్మీర్‌ వెళ్లారు. అక్కడి మార్కెట్లో తిరుగుతూ షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్‌ ఇవ్వమని అడిగాడు. ‘ఎంత డిస్కౌంట్‌ ఇస్తావు నాకు’ అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్‌ ‘20 శాతం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్‌ షాపును సందర్శించండి. నా పేరు చెప్పి డిస్కౌంట్‌ కూడా పొందండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీధి వ్యాపారిని సపోర్ట్‌ చేస్తూ సోను చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనూ ప్రస్తుతం చిరు కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని