Sonu Sood: అప్పుడు నన్ను దక్షిణాది చిత్రాలే రక్షించాయి..!

బాలీవుడ్ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్‌ సినిమాతో జూన్‌ మూడున ప్రేక్షకులను పలకరించనున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్‌.

Published : 28 May 2022 18:19 IST

(సోనూసూద్ ఇన్‌స్టాగ్రాం నుంచి)

ముంబయి: బాలీవుడ్ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్‌ సినిమాతో జూన్‌ మూడున ప్రేక్షకులను పలకరించనున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్‌. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో సోనూ.. చాంద్‌ బర్దాయ్‌ పాత్రలో అలరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. 

‘హిందీ చిత్రాలను కాదనుకొని, దక్షిణాది చిత్రాలను అంగీకరించడంపై నాకు తరచూ ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే నేను ఏం చేస్తున్నానో నాకు స్పష్టత ఉంది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఏ భాషా చిత్రం చేసినా స్క్రిప్ట్‌ను బట్టి జాగ్రత్తగా ఎంచుకుంటాను. నాకు నచ్చని హిందీ చిత్రాలను చేయకుండా ఉండేలా దక్షిణాది నన్ను రక్షించింది. పెద్ద చిత్రాల్లో కనిపించడం కోసమే సినిమా చేస్తున్నాం అనే దశ వస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు దక్షిణ భారత చిత్రాలు ఉపకరించాయి. ఈ రంగంలో ఉన్నప్పుడు ప్రజలకు వినోదం పంచాలి. నేను విజయవంతమైన నటుడినని ప్రేక్షకులను తేలికగా తీసుకుంటే కుదరదు’ అని సోనూ చెప్పుకొచ్చారు. అలాగే మహమ్మారి తర్వాత తనకు అన్నీ పాజిటివ్ పాత్రలే వస్తున్నాయని చెప్పారు. తనను నెగెటివ్ పాత్రల్లో చూపించేందుకు నిర్మాతలు వెనుకాడినట్లు చెప్పారు. ఇది తన జీవితంలో మరో దశ అని, తనకొక కొత్త ఇన్నింగ్స్‌ అని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని