Tip Tip Song: అప్పుడు రవీనా.. ఇప్పుడు కత్రినా.. టిప్‌ టిప్‌ బర్‌సా పానీ..!

ఒక చిత్రంలో విజయవంతమైన పాటను రీమిక్స్‌ చేసిన కొత్త చిత్రంలో వాడుకోవటం అన్ని భాషల్లోనూ చూస్తుంటాం.

Updated : 07 Nov 2021 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక చిత్రంలో విజయవంతమైన పాటను రీమిక్స్‌ చేసిన కొత్త చిత్రంలో వాడుకోవటం అన్ని భాషల్లోనూ చూస్తుంటాం. గతంలో తెలుగులో వచ్చిన పాటలెన్నో రీమిక్స్‌ అయ్యాయి. అవుతున్నాయి. 90 దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బాలీవుడ్‌ సాంగ్‌ ‘టిప్‌ టిప్‌ బర్‌సా పానీ’. అక్షయ్‌కుమార్‌, రవీనా టాండన్‌ జంటగా నటించిన ‘మోహ్ర’ చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. పసుపు రంగు చీరలో రవీనా వానలో తడుస్తూ అందాలను ఒలకబోస్తుంటే, ఆ వయ్యారాల ఒంపులు చూసి అందులో హీరో అక్షయ్‌ మాత్రమే కాదు, తెరపై సినిమా చూస్తున్న యువత కూడా పిచ్చెక్కిపోయారు. ఇప్పుడు అదే పాటను అక్షయ్‌ కుమార్‌, కత్రినాకైఫ్ జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సూర్యవంశీ’ కోసం రీమిక్స్‌ చేశారు సంగీత దర్శకుడు తనిష్‌ బాగ్చి. రోహిత్‌శెట్టి తెరకెక్కిన ఈ చిత్రం  దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ‘టిప్‌ టిప్‌ బర్‌సా పానీ’ పాటను రీమిక్స్‌ చేశారు. ఫరాఖాన్‌ నృత్యాలు సమకూర్చారు. అప్పట్లో రవీనా తళుకు బెళుకులకు ఏమాత్రం తీసిన పోని విధంగా కత్రినా అదరగొట్టేసింది. అప్పటి యువత పరిస్థితి ఏంటో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం కత్రినా డ్యాన్స్‌, అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ పాటనూ, అప్పట్లో రవీనా పాటను రెండింటినీ చూసేయండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని