RIP Vivek: హృదయం ముక్కలైంది..!
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ శుక్రవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణంతో చిత్రపరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు...
హాస్యనటుడి మృతికి సినీ ప్రముఖుల సంతాపం
ఇంటర్నెట్ డెస్క్: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వివేక్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని వారు పేర్కొన్నారు.
హాస్యనటుడు వివేక్ అకాల మరణం చాలామందిలో విషాదం మిగిల్చింది. ఆయన కామెడీ టైమింగ్, డైలాగులు ప్రజలకు ఎంతో వినోదం పంచాయి. ఆయన తన సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ పర్యావరణం, సమాజం కోసం పరితపించారు. ఆయన కటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి. - నరేంద్రమోదీ
జూనియర్ కలైవనార్, సామాజిక కార్యకర్త, నా సన్నిహితుడు వివేక్. ఆయన మరణం నాకు చాలా బాధ కలిగించింది. ‘శివాజీ’ తెరకెక్కిస్తున్న సమయంలో నేను అతనితో ఉన్న సమయాన్ని ఎప్పటికీ మరచిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. - రజనీకాంత్
నా స్నేహితుడు వివేక్. ఆయన మరణం తమిళ సమాజానికి ఒక విపత్తులాంటిది. - కమల్‌హాసన్
నటుడు వివేక్‌గారు మరణించారనే ఈ దుర్వార్త హృదయ విదారకం. మీరు లేని లోటు తీర్చలేనిది. మీ ఆత్మకు శాంతి కలగాలి. - వెంకటేశ్
మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధ కలిగించింది. మీ కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వివేక్. - రమ్యకృష్ణ
మిమ్మల్ని చూస్తూ పెరిగాను. మీ కామెడీ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుండేవారు. మీరు ఒక అరుదైన రత్నం. ఎప్పటికీ గుర్తుంచుకుంటాం సర్. - రామ్ పోతినేని
వివేక్‌గారి మరణవార్త విస్మయానికి గురిచేసింది. గుండె బద్దలైంది. నా అభిమాన హాస్యనటుల్లో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. - మంచు లక్ష్మి
నా అభిమాన హాస్యనటుడు ఇక మనతో లేరనే వార్త నమ్మలేకపోతున్నాను. దురదృష్టవశాత్తూ ఆయనతో నటించే అవకాశం నాకు రాలేదు. కానీ.. ఆయనతో మాట్లాడిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తన జీవితం మొత్తం ఇతరులను నవ్వించేందుకు త్యాగం చేశారు. ఎవరితోనూ సాధ్యంకాని విధంగా హాస్యంలోనూ మంచి సామాజిక సందేశాలు ఇచ్చారు. ఆయన ఒక సామాజిక వేత్త. తమిళసినిమాలో ఆయన లేనిలోటు పూడ్చలేనిది. - కీర్తిసురేశ్
‘నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ - మోహన్‌లాల్
‘ప్రముఖ హాస్యనటుడు వివేక్ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు’ - సమంత
‘మీరు ఇకపై మా మధ్య ఉండరనే వార్తను నేను నమ్మలేకపోతున్నా. మిమ్మల్ని మేము ఎంతో మిస్ అవుతాం. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’ - హన్సిక
‘నా అభిమాన నటుడు, ఎవరి నుంచి అయితే నేను స్ఫూర్తి పొందానో అలాంటి గొప్ప వ్యక్తి ఇకలేరు అనే వార్త నన్ను ఎంతో కలచివేసింది. దేవుడు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా’ - శ్రీనువైట్ల
‘మాలో ఎన్నో మంచి ఆలోచనలు రేకెత్తించినందుకు, వైవిధ్యమైన నటనతో మమ్మల్ని మనసారా నవ్వించినందుకు థ్యాంక్యూ మై డియర్ ఫ్రెండ్ వివేక్. ఇకపై నిన్ను ఎంతో మిస్ అవుతా’ - ప్రకాశ్‌రాజ్
‘మీ మరణవార్త నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. మిస్ యూ సర్. మీ మరణం చిత్రపరిశ్రమకు పెద్ద లోటు’ - అట్లీ
‘వివేక్ మరణవార్త బాధపెట్టింది. ఆయన మరణం కేవలం చిత్రపరిశ్రమే కాకుండా సమాజానికి కూడా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. ఆయన చేయాలనుకున్న మంచి కార్యక్రమాలను సాధ్యమైనంత వరకూ నేను చేస్తాను’ - రాఘవా లారెన్స్
‘మా తరానికి చెందిన ఓ గొప్ప హాస్యనటుడు వివేక్ మరణవార్తతో నేను ఉలిక్కిపడ్డాను. నా హృదయం ముక్కలైంది. నేను ఎప్పటికీ ఆయనకు వీరాభిమానినే. వివేక్.. మా హృదయాల్లో మీరు చిరస్థాయిగా ఉంటారు’ - దేవిశ్రీ ప్రసాద్
‘ఎన్నో పాత్రల్లో నటించి మీరు మమ్మల్ని ఆనందింపజేశారు. ఇకపై మిమ్మల్ని మిస్ అవుతాం’ - నందిని రెడ్డి
‘మంచి వ్యక్తి, అద్భుతమైన నటుడు అయిన వివేక్ మనల్ని విడిచివెళ్లిపోయారని తెలిసి ఎంతో బాధపడ్డాను. మీతో కలిసి స్క్రీన్ పంచుకున్నందుకు సంతోషిస్తున్నా. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’ - సురభి
‘మీ నటనతో ఎంతోమంది ముఖాలపై చిరునవ్వులు పూయించారు. ఓ గొప్ప హాస్యనటుడు, అద్భుతమైన నటుడు, సామాజిక సృహ కలిగిన వ్యక్తి మీరు. అలాంటిది ఇకపై మీరు మా మధ్య ఉండరు అనే ఆలోచనే ఎంతో భయంకరంగా ఉంది. ఒక అభిమానిగా మిమ్మల్ని ఎంతో మిస్ అవుతా’ - విక్రమ్ ప్రభు
‘వివేక్ మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ - కార్తిక్ సుబ్బరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!