Vaarasudu: ఇన్నాళ్లు గాయాలు మాయమమ్మా..

సంక్రాంతి బరిలో ‘వారసుడు’గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు.

Updated : 21 Dec 2022 07:01 IST

సంక్రాంతి బరిలో ‘వారసుడు’గా (Vaarasudu) సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌ (Vijay). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. రష్మిక (Rashmika) కథానాయిక. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. మంగళవారం ఈ చిత్రంలోని ‘‘ఇట్స్‌ ఫర్‌ యూ అమ్మ’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ‘‘అమ్మమ్మ నేనేమి వింటినమ్మా.. వాకిల్ల నిలిచింది వాస్తవమా.. ఇన్నాళ్లు గాయాలు మాయమమ్మా.. అచ్చంగా ఈరోజు నాదేనమ్మా’’ అంటూ అమ్మ సెంటిమెంట్‌తో సాగుతున్న ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. చిత్ర ఆలపించారు. ఈ సినిమాలో విజయ్‌ తల్లి పాత్రను జయసుధ పోషిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని