Chandra Mohan: అందుకే రిటైర్మెంట్‌..

‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఆల్‌రౌండర్‌గా    మారక తప్పదు. కచ్చితంగా అన్ని పాత్రలు పోషించగలగాలి. అలా ఉన్నా కాబట్టే 50ఏళ్లుగా చిత్రసీమలో ఉండగలిగా.

Published : 23 May 2021 00:30 IST

‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఆల్‌రౌండర్‌గా మారక తప్పదు. కచ్చితంగా అన్ని పాత్రలు పోషించగలగాలి. అలా ఉన్నా కాబట్టే 50ఏళ్లుగా చిత్రసీమలో ఉండగలిగా. హీరోగానే చేయాలనుకుని ఉంటే ఇన్నేళ్ల ప్రయాణం సాధ్యమయ్యేది కాద’’న్నారు నటుడు చంద్రమోహన్‌. కథానాయకుడిగా తెరపైకి అడుగుపెట్టి.. ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించారు చంద్రమోహన్‌. 55ఏళ్ల సినీ ప్రయాణంలో నాలుగు భాషల్లో తొమ్మిదొందలకు పైగా చిత్రాల్లో నటించి మురిపించారు. ఆదివారంతో ఆయన 80ఏళ్లు పూర్తి చేసుకొని 81వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ సినీ జీవితం చాలా పాఠాలు నేర్పించింది. ఇక్కడ పేరు, డబ్బు, బంధాలు.. ఏవీ శాశ్వతం కాదని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదమని నేర్పింది. చిత్రసీమ వేలాది మందికి ఉపాధి కల్పించినంత కాలం, నిర్మాతలు చల్లగా ఉన్నంత కాలం ఏ ట్రెండైనా పర్వాలేదు. కరోనా మాత్రం చిత్ర పరిశ్రమకు ఉపాధి లేకుండా చేసింది. 50ఏళ్లలో నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా. ‘రాఖీ’లో ఎమోషనల్‌ సీన్‌ చేసి వచ్చి.. బైపాస్‌ సర్జరీ కోసం నేరుగా ఆస్పత్రిలో చేరా. ‘దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రీకరణ సమయంలో అనారోగ్యం వల్ల షూట్‌ వాయిదా వేయాల్సి వచ్చింది. నా వల్ల నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకిష్టం లేదు. అందుకే రిటైర్మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. టీవీ, యూట్యూబ్‌ల ద్వారా నా చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంటున్నాయి. వాటిని చూసే అభిమానులు ఎక్కువయ్యారు. ఈ జన్మకి ‘ఇది చాలు’ అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు