
Niharika NM: మహేశ్, యశ్, అజయ్‌దేవ్‌గణ్ ఈమె వీడియోలకు ఫిదా.. ఎవరీ నిహారిక ఎన్ఎం?
ఇంటర్నెట్ డెస్క్: మహేశ్‌బాబు, యశ్, అజయ్దేవ్గణ్కే కాదు షాహిద్‌కపూర్, రకుల్‌ప్రీత్‌సింగ్, రెజీనా.. ఇలా టాలీవుడ్ టు బాలీవుడ్ తారలు ఆమె వీడియోలకు అభిమానులు. ఎంతగా అంటే తమ చిత్ర ప్రచారాన్ని ఆమెతో కలిసి చేసేంత. ‘సర్కారు వారి పాట’ కోసం మహేశ్, ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ కోసం యశ్, ‘రన్‌వే 34’ కోసం అజయ్, ‘జెర్సీ’ కోసం షాహిద్ ఆమెను సంప్రదించారంటే ఆ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరామె అంటారా? ఆ డిజిటల్ క్రియేటర్ ఎవరో కాదు నిహారిక ఎన్ఎం. సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారికి ఈమె సుపరిచితురాలు కావొచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ తెరచినా, ట్విటర్ ఓపెన్ చేసినా తన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. తనను తాను ఓ బ్రాండ్‌గా మలుచుకున్న నిహారిక ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టైప్స్ అదుర్స్
నిహారిక (24) చెన్నైలో పుట్టింది. బెంగళూరులో పెరిగింది. కాలిఫోర్నియాలో ఎంబీఏ విద్యను అభ్యసించింది. తనకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండటంతో ఆ దిశగానే కెరీర్‌ను ఊహించుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని, డిజిటల్ బాట పట్టింది. ప్రారంభంలో తన వీడియోలకు ఊహించినంత ఫలితం రాకపోవడంతో అందరిలానే తానూ కాస్త నిరుత్సాహపడింది. అయితేనేం, తన లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలనే బలమైన కాంక్షతో మరో అడుగు ముందుకేసి, ‘నలుగురిలో ఒకరిలా కాకుండా నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి’ అనుకుని కామెడీ వీడియోలు తీయడం ప్రారంభించింది. ఇలా ఆమె రూపొందించిన ‘టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ బిఫోర్ యాన్ ఎగ్జామ్’, ‘టైప్స్ ఆఫ్ పీపుల్ ఎట్ కాలేజ్’ తదితర ‘టైప్’ సిరీస్ వీడియోలు ఆమెకు బాగా పేరు తీసుకొచ్చాయి. ‘టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ బిఫోర్ యాన్ ఎగ్జామ్’ వీడియోతో కొన్ని గంటల్లోనే 10,000 మంది కొత్త సబ్స్రైబర్లను సొంతం చేసుకోగలిగిందంటే నిహారిక ఎలాంటి కంటెంట్ అందిస్తుందో తెలుస్తోంది. ప్రస్తుతం తన ఛానెల్‌కు 9.76లక్షలకుపైగా సబ్స్రైబర్లు ఉన్నారు. ఆమె ప్రతిభను మెచ్చి ‘క్రియేటర్స్ ఫర్ ఛేంజ్’ అనే ఇనిషియేటివ్‌కు నిహారికను వరుసగా మూడుసార్లు గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించుకుంది యూట్యూబ్ సంస్థ.
లక్ష నుంచి 22 లక్షలు..
యూట్యూబ్‌లో రాణిస్తుండగానే ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లోకి నిహారిక ఎంట్రీ ఇచ్చింది. స్వీట్ అండ్ షాట్ ఫన్నీ వీడియోలతో కొన్ని కోట్లమంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఒక్కోమెట్టు ఎక్కే క్రమంలో ఆమె చేసిన ‘లివింగ్ ఎలోన్ 101’ అనే వీడియో వైరల్ అవడమేకాకుండా 13 రోజుల్లో 11 మిలియన్లకుపైగా ఫాలోవర్స్‌ను సంపాదించిపెట్టింది. ఆ వీడియోకు వచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని వైవిధ్యభరిత స్కిట్స్‌ను రూపొందించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. అలా ఆ నోటా ఈ నోటా నిహారిక వీడియోల గురించే అంతా చర్చించుకునేవారు. తన కామెడీ చూసి కడుపుబ్బా నవ్వుకునేవారు. ప్రస్తుతం నిహారికను అనుసరిస్తున్న వారి సంఖ్య 2.2 మిలియన్‌కుపైగానే. వీరిలో సినీ ప్రముఖులెందరో ఉన్నారు.
వదిలేద్దామనుకున్న స్థితి నుంచి
‘‘కెమెరా ముందు నటించడమంటే నాకు చాలా ఇష్టం. నా చుట్టూ ఉన్నవారిని నవ్వించడం నాకు సరదా. వీడియోలు రూపొందిచడంలో నా కుటుంబం, స్నేహితులు నన్నెంతగానో ప్రోత్సహించారు. అలా అని నేను చదువునెప్పుడూ అశ్రద్ధ చేయలేదు. ఓ డిగ్రీ సంపాదించుకున్నాకే పూర్తిగా ఇటువైపు వచ్చా. అందరికీ ఎదురైనట్టే నాపైనా ట్రోల్స్ వస్తుంటాయి. నేను వాటిని పట్టించుకోను. పాజిటివ్ కామెంట్లను దృష్టిలో పెట్టుకుని ఇంకెంత బాగా చేయాలో దాని గురించే ఆలోచిస్తుంటా. ఒకానొక సమయంలో సోషల్ మీడియాను వద్దిలేద్దాం అనుకున్న స్థితి నుంచి ఈ స్థాయికి చేరుకున్న నా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటుంటే భావోద్వేగానికి గురవుతా’’ అని ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది నిహారిక. ఇంతమంది యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లు ఉండగా ఈమెనే ఎందుకంత ప్రత్యేకం అనుకుంటుంటే కింది వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది...
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Gold: దిగుమతి సుంకం ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.1310 పెరిగిన బంగారం ధర
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Revanth Reddy: ప్రాజెక్టుల పేరుతో అరాచకాలా?: సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ
-
Politics News
Telangana News: భాజపా, కాంగ్రెస్ శ్రేణులపై లాఠీఛార్జి.. హనుమకొండలో ఉద్రిక్తత
-
Business News
Hero motocorp: ‘హీరో’ ట్రేడ్ మార్క్ వ్యవహారం.. హీరో మోటోకార్ప్‌కు ఊరట
-
Politics News
Bandi sanjay: మా కార్పొరేటర్లను భయపెట్టి తెరాసలో చేర్చుకున్నారు: బండి సంజయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..