sankarabharanam: శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం

క్లాసిక్‌ మూవీ ‘శంకరాభరణం’ (sankarabharanam) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ఎంపికైంది.

Published : 21 Nov 2022 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్లాసిక్‌ మూవీ ‘శంకరాభరణం’ (sankarabharanam) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ఎంపికైంది. దేశంలో విడుదలైన గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి భద్రపరుస్తుంటుంది ‘నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ఇండియా’. ఈ పక్రియకు కళా తపస్వి కె.విశ్వనాథ్‌ రూపొందించిన ‘శంకరాభరణం’ ఎంపికైంది. పూర్ణోదయ ఆర్ట్స్‌క్రియేషన్స్‌ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.వి సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  చలన చిత్రోత్సవాల్లో భాగంగా ఈ మూవీని ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏడిద నాగేశ్వరరావు కూమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని