Bheemla Nayak: నెక్లెస్‌ రోడ్డులో ‘భీమ్లానాయక్‌’ స్పెషల్‌ కటౌట్‌

పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రల్లో నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’.

Published : 26 Mar 2022 02:06 IST

హైదరాబాద్: పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రల్లో నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా మార్చి 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవన్‌ అభిమానులు హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భీమ్లానాయక్‌’ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ జీపుపై కూర్చొన్న స్టిల్‌ కటౌట్‌ను ఆవిష్కరించారు. నెక్లెస్‌ రోడ్‌లో అన్ని వైపులా కనిపించేలా తీర్చిదిద్దిన కటౌట్‌ వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీకెండ్‌ కావడంతో నెక్లెస్‌ రోడ్డుకు వచ్చిన యువత ఈ కటౌట్‌ ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్‌ సంభాషణలు అందించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని