
Published : 29 Jan 2022 14:47 IST
Bangarraju: ‘బంగార్రాజు’ స్పెషల్ సాంగ్ విన్నారా..!
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు చెబుతూ నాగార్జున సర్ప్రైజ్ ఇచ్చారు. ‘బంగార్రాజు’ నుంచి ఓ సరికొత్త పాటను ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ‘‘మా సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ‘బంగార్రాజు’ ఫైనల్ సాంగ్ మీకోసం..’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘నువ్వు సిగ్గుపడుతుంటే’ అంటూ సాగే ఈ మెలోడీని చిత్ర, సాయి చరణ్, రమ్య బెహరా ఆలపించారు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలకపాత్రలు పోషించారు.
ఇవీ చదవండి
Tags :