vamsy: దర్శకుడు వంశీ గురించి ఆసక్తికర విశేషాలు.. ‘వెండితెర వేల్పులు’

‘వెండితెర వేల్పులు’ కార్యక్రమంలో ఈ వారం ‘వైవిధ దర్శకుడు వంశీ’ సినీప్రస్థానం అలరించేందుకు సిద్ధమైంది.

Published : 16 Jan 2022 03:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తేనె తెలుగులో ముంచి, పల్లె సీమల ఆత్మీయతలను పట్టితెచ్చి.. వెండితెరపై దృశ్యకావ్యాలు విరచించిన విపంచి ఆయన... పాపికొండల బోటు, ఆత్రేయపురం పూతరేకు, ఆర్టోసు కూల్ డ్రింకు, కథానాయకి కట్టుబొట్టులో ఆత్మవిశ్వాసం, కడియం పూలబుట్ట, మాఘమాసంలో నారింజ పరిమళం ఆయన ట్రేడ్‌మార్కులు... ఆయన కావ్యనాయిక సినీ కథానాయక. తళుకులీనే తటిల్లత, వెండితెర విద్యుల్లత. పల్లెదనానికి, పచ్చదనానికి నెచ్చెలి.. ఇంతకీ ఈ పరిచయం ఎవరి గురించో మీకు అర్థం అయిపోయుండాలిగా.. ఆయనే దర్శకుడు వంశీ. ‘వెండితెర వేల్పులు’ కార్యక్రమంలో ఈ వారం ‘వైవిధ్య దర్శకుడు వంశీ’ సినీప్రస్థానం అలరించేందుకు సిద్ధమైంది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ తెలంగాణ ఛానెల్స్‌లో ఈనెల 16, ఆదివారం ఉదయం 10.30గం.కు, సాయంత్రం 6.30గం.కు, రాత్రి 10.30 గం.కు  తప్పక చూడండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని