Agent: అఖిల్ కఠోర శ్రమ.. మమ్ముట్టి మెచ్చిన కథ.. ‘ఏజెంట్’ విశేషాలివి..
హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన ‘ఏజెంట్’ త్వరలోనే విడుదలకాబోతోంది. ఈ సినిమా సంగతులపై ఓ లుక్కేయండి..
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి (Surender Reddy) తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ఏజెంట్’ (Agent Release on April 28th) విశేషాలు తెలుసుకుందామా..
- హీరోగా అఖిల్ నటించిన ఐదో చిత్రమిది. తొలి చిత్రం ‘అఖిల్’ మినహా ఆయన నటించిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లు రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రూపొందినవే. స్వతహాగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే అఖిల్ చాలా గ్యాప్ తర్వాత ‘ఏజెంట్’ (Agent On April 28th)తో తనలోని మాస్ కోణాన్ని చూపించబోతున్నాడు.
- అఖిల్‌కు ఇది తొలి పాన్ ఇండియా చిత్రం. తన సత్తా ఏంటో అన్ని భాషల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘స్పై’ కథను ఎంపిక చేసుకున్నాడు. అందులోని కథానాయక పాత్రలో ( ఏజెంట్ రిక్కీ) ఒదిగిపోయేందుకు పది నెలలు కఠోరంగా శ్రమించాడు. తన శరీరాకృతిని పూర్తిగా మార్చేసుకున్నాడు. హెయిర్ కూడా బాగా పెంచాడు. లవర్‌బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి.. తుపాకీ చేతపట్టి.. అభిమానులతోపాటు ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రాణం పెట్టి నటించాడు. ‘‘అందరూ అనుకుంటున్నట్టు నేను ఈ సినిమా కోసం ఫిజికల్‌కాదు మెంటల్‌గా ఎక్కువ కష్టపడ్డా’’ అని అఖిల్ చెబుతుంటాడు.
- మహారాష్ట్రకు చెందిన మోడల్ సాక్షివైద్య (Sakshi Vaidya) ఈ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయంకాబోతోంది. ఇందులో విద్య అనే క్యారెక్టర్ ప్లే చేసిందామె. ఈ చిత్రం విడుదలకాకముందే తెలుగులో మరికొన్ని అవకాశాలు దక్కించుకుంది. ఫస్ట్ మూవీ రిలీజ్‌కు ముందే ఇతర ప్రాజెక్టులో ఛాన్స్ వచ్చిందంటే తన ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
- ప్రముఖ మలయాళ నటుడు ముమ్ముట్టి (Mammootty) ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. సుమారు 45 ఏళ్ల నట ప్రస్థానంలో ఆయన నేరుగా నటించిన తెలుగు చిత్రాలు చాలా తక్కువ. ‘మమ్ముట్టికి కథ నచ్చి, ఆయా సినిమాల్లో నటించాడంటే అది హిట్ అయినట్టే’ అని అక్కినేని నాగార్జున ‘ఏజెంట్’ (Agent Movie) విషయంలో ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. ‘స్వాతికిరణం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మమ్ముట్టి ఆ తర్వాత ఇక్కడ ‘సూర్యపుత్రులు’, ‘యాత్ర’ చిత్రాల్లో నటించారు. పనిపట్ల నిబద్ధతగా ఉండే మమ్ముట్టి తన తల్లి చనిపోయిన బాధలోనూ ‘ఏజెంట్’లోని పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
- ‘మిర్చి’ సంపత్‌రాజ్ మరో కీ రోల్ ప్లే చేశారు. డినో మొరియా, విక్రమ్‌జీత్, డెంజిల్ స్మిత్ వంటి బాలీవుడ్ నటులు ప్రతినాయక పాత్రల్లో సందడి చేయనున్నారు.
- ‘వేర్ ఈజ్ ది పార్టీ బాసు.. వేర్ ఈజ్ ది పార్టీ’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) ‘ఏజెంట్’తో కలిసి ‘వైల్డ్ సాలా’ (Wild Saala) అనే పాటకు స్టెప్పులేసింది.
- దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇది పదో సినిమా. ‘ధృవ’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి హిట్ సినిమాల తర్వాత సురేందర్ దర్శకత్వం వహించిన చిత్రంకావడంతో ‘ఏజెంట్’పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
- ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అక్కినేని హీరోతో నిర్మించిన తొలి చిత్రమిదే. నాగార్జున (Nagarjuna Akkineni)తోనే తమ బ్యానర్‌లో తొలి సినిమాని నిర్మించాలకున్నారు ఆ సంస్థ నిర్మాతలు రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర. నాగార్జున తనయుడితో ‘ఏజెంట్’ రూపంలో ఆ కలను నెరవేర్చుకున్నారు.
- హైదరాబాద్, విశాఖపట్నం, మనాలి, బుడాపెస్ట్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. బడ్జెట్.. సుమారు 100 కోట్లు అని సమాచారం.
- 2021 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ సినిమా 2023లో ఏప్రిల్‌లో విడుదలవుతోంది. కొవిడ్/లాక్‌డౌన్ తదితర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 156: 07 నిమిషాల (సుమారు రెండున్నర గంటలు) నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సంభాషణలు, విజువల్స్‌ల విషయంలో ఎనిమిది చోట్ల మార్పులు సూచించింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్
-
TSPSC: తెలంగాణ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు..
-
KL Rahul: కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్
-
IRCTC tour package: ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..!
-
Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు
-
Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం