Telugu songs: అటు ‘సీసా’.. ఇటు ‘రక్కమ్మ’.. అందుకు అంజలి ‘రెడీ’

ఓ సినిమాలో కథానాయికగా నటిస్తే ఎంతటి గుర్తింపు లభిస్తుందో ఒకే ఒక్క ఐటెమ్‌ సాంగ్‌తో అంతటి క్రేజ్‌ వస్తుంది. అందుకే అగ్ర తారలూ ప్రత్యేక గీతాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. స్పెషల్‌ గీతాల్లో ఆడిపాడిన వారు అవకాశం వస్తే మళ్లీ మళ్లీ నర్తించేందుకు సై అంటుంటారు.

Published : 12 Jul 2022 12:02 IST

Special songs: ఓ సినిమాలో కథానాయికగా నటిస్తే ఎంతటి గుర్తింపు లభిస్తుందో ఒకే ఒక్క ఐటెమ్‌ సాంగ్‌తోనూ అంతటి క్రేజ్‌ వస్తుంది. అందుకే అగ్ర తారలూ ప్రత్యేక గీతాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. స్పెషల్‌ గీతాల్లో ఆడిపాడిన వారు అవకాశం వస్తే మళ్లీ మళ్లీ నర్తించేందుకు సై అంటుంటారు. అలా త్వరలోనే తమ డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు సిద్ధమైన కథానాయికలెవరో చూద్దాం..

అంజలి మరోసారి రెడీ

‘నన్ను ఎట్టాగ పిలిచినా రెడీ’ (Ra Ra Reddy) అంటూ హుషారెత్తిస్తోంది అంజలి (Anjali). నితిన్‌ (Nithiin) హీరోగా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) సినిమాలోని గీతమిది. ‘రా రా రెడ్డి.. ఐ యామ్‌ రెడీ’ అనే ఈ పాట లిరికల్‌ వీడియో ఇటీవల విడుదలై, సందడి చేస్తోంది. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి ఎం.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్‌ (Catherine) కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. అంజలి గతంలో జీవా ‘కో’, సూర్య ‘సింగం 2’, అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో కనిపించింది.


సీకాకుళం సారంగిగా అన్వేషి

‘నా పేరు సీసా’ (Naa Peru Seesa) అనే గీతంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న నటి అన్వేషి జైన్‌ (Anveshi Jain). రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (RamaRao On Duty) చిత్రంలోని పాట ఇది. ఇటీవల విడుదలైన ఈ లిరికల్‌ వీడియోకు విశేష స్పందన లభించింది. ‘గందీ బాత్‌ 2’ అనే వెబ్‌ సిరీస్‌, ‘కమిట్‌మెంట్‌’ తదితర చిత్రాల్లో నటించిన అన్వేషి స్టెప్పులేసి తొలి ఐటెమ్‌ సాంగ్‌ ఇదే. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు శరత్‌ మండవ రూపొందించిన ‘రామారావు’ జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.


రా రా రక్కమ్మ

ప్రత్యేక గీతాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే భామల్లో జాక్వెలిన్‌ (Jacqueline Fernandez) ఒకరు. ఇప్పటికే ఎన్నో సూపర్‌హిట్‌ గీతాలతో హుషారెత్తించిన ఈమె ఇప్పుడు ‘రా రా రక్కమ్మ’ (Ra Ra Rakkamma) అనే పాటతో సందడి చేస్తోంది. కిచ్చా సుదీప్‌ (kichcha sudeep) హీరోగా తెరకెక్కిన ‘విక్రాంత్‌ రోణ’ (Vikrant Rona) చిత్రంలోని గీతమిది. అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న విడుదల కాబోతుంది.


సునీల్‌(sunil), అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్‌ మాలిక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దర్జా’. శివశంకర్‌  పైడిపాటి నిర్మాత. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ‘లింగో లింగో’ అంటూ పాట కూడా నెటిజన్లను అలరిస్తోంది. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందించిన ఈ పాటను మౌష్మి నేహా ఆలపించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని