Tollywood: ఒకటి, రెండు కాదు ఏడు.. టాలీవుడ్లో కొత్త ట్రెండు!
చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక సినిమాకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు విడుదల తేదీలు తెరపైకొచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక సినిమాకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు విడుదల తేదీలు తెరపైకొచ్చాయి. కొవిడ్/ కరోనా ఇందుకు ఓ కారణంగా నిలిచింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ఈ కొత్త పంథాకి నాంది పలికింది.
అది లేదా ఇది..
సుమారు రూ. 400 కోట్లతో నిర్మితమైన పాన్ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం- ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కొవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 2022 సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినా థర్డ్ వేవ్ దృష్ట్యా మరోసారి వాయిదా వేయక తప్పలేదు. కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్త విడుదల తేదీల్ని ఇటీవల ప్రకటించింది. టాలీవుడ్లో ఎన్నడూలేని విధంగా రెండు తేదీలను ఫిక్స్ చేసింది. అప్పటి పరిస్థితిని బట్టి.. మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. కానీ, అనూహ్యంగా మార్చి 25ను ఖరారు చేసింది.
ఇదే బాటలో..
విడుదల తేదీ ప్రకటనకు సంబంధించి కొన్ని చిత్ర బృందాలు ఇదే బాటలో నడిచాయి. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్’ను ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఫిబ్రవరి 25నే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సాగర్ కె. చంద్ర తెరకెక్కించారు. నిత్య మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు.
బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్‌తేజ్ నటించిన చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. విడుదలకు సంబంధించి చిత్ర బృందం ఫిబ్రవరి 25, మార్చి 4 తేదీలను బుక్ చేసింది. ఫిబ్రవరి 25నే విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఇదే రోజు ‘భీమ్లానాయక్’ విడుదలవుతుండటంతో ‘గని’ విడుదలపై మీమాంస నెలకొంది. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ సినిమా విడుదలకానుంది. త్వరలోనే ఓ డేట్ ఖరారవుతుంది.
అంటే.. సరదాకి!
‘‘మీరంతా రెండు తేదీలు బుక్ చేస్తే మేం ఏడు చేయకూడదా’’ అంటూ నటుడు నాని పెట్టిన ఫన్నీ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 22, ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10.. వీటిల్లో ఎప్పుడైనా తాను హీరోగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ ప్రేక్షకుల ముందుకురానుంది. వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని సరసన నజ్రియా సందడి చేయనుంది. కొవిడ్‌తో మొదలైన ఈ నయా ట్రెండ్ ఇలానే కొనసాగుతుందా? అంటే కాలమే సమాధానం చెప్పాలి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!