Squid Game: స్క్విడ్గేమ్కి ఎందుకింత క్రేజ్?
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దగ్గర నుంచి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వెబ్‌సిరీస్.. దృశ్యరూపం దాల్చడానికి మాత్రం అనేక కష్టాలు ఎదుర్కొంది.
‘స్క్విడ్ గేమ్’..ఇప్పుడు ఏ దేశంలో చూసిన ఈ వెబ్ సిరీస్ గురించే చర్చ. సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్‌సిరీస్ విడుదలైన 90 దేశాల్లో నెం.1గా కొనసాగుతుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. కేవలం 27 రోజుల్లో 111మిలియన్ వీక్షకులకు చేరువైందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అంటే ఏస్థాయిలో ఈ వెబ్‌సిరీస్ విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అక్టోబరు 17 నాటికి స్క్విడ్‌గేమ్ విడుదలై సరిగ్గా నెల రోజులు. ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ జనాలకు అంతగా నచ్చడానికి కారణమేంటి? దీన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు పడిన కష్టాలేంటో ఓసారి తెలుసుకుందాం.
పదేళ్ల నిరీక్షణ
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దగ్గర నుంచి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వెబ్‌సిరీస్.. దృశ్యరూపం దాల్చడానికి మాత్రం అనేక కష్టాలు ఎదుర్కొంది. దీన్ని దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ తెరకెక్కించాడు. ‘స్క్విడ్‌గేమ్’ కథను 2009లోనే రాసుకున్నాడు. వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మాత్రం పదేళ్లపాటు ప్రసవవేదన పడిందీ కథ. ఇంత కాలం పట్టడానికి ఆర్థికంగా ఆయనను వెంటాడిన కష్టాలు కూడా కారణమే. డబ్బుల్లేక ల్యాప్‌టాప్ అమ్మేసి జీవితాన్ని నెట్టికొచ్చిన సందర్భాలున్నాయి. స్క్రిప్ట్‌తో ఏ స్టూడియోకి వెళ్లినా తిరస్కరణే ఎదురయ్యేది. ‘చిన్నపిల్లల ఆటను ఎవరు చూస్తారు’ అని మొహం మీదే తలుపులేసిన వారున్నారు. ప్రపంచాన్ని కొవిడ్ కుదిపేశాక ‘స్క్విడ్‌గేమ్’ కథపై అందరి దృష్టి పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హక్కులు తీసుకొని నిర్మించింది. ఇందులోని మొత్తం తొమ్మిది ఎపిసోడ్లని దర్శకుడే తెరకెక్కించాడు. ఆయన నిజజీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు దీన్ని మరింత బలంగా రాయడానికి తోడ్పడ్డాయి. అమెరికాతో పాటు మిగతా అన్నిదేశాల్లో ట్రెండింగ్‌లో ఉందీ సిరీస్. ఇండియా ఓటీటీ వీక్షకులను కూడా అమితంగా ఆకట్టుకోవడమే కాదు, కొద్ది రోజులుగా నెం.1 స్థానంలో కొనసాగుతుంది.
అప్పుల్లో కూరుకున్న వారితో నెత్తుటి ఆట
జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పుల పాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్ గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. చివరగా వచ్చే ఆట పేరే ‘స్క్విడ్ గేమ్’. దక్షిణ కొరియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న చిన్నపిల్లల ఆట ఇది. ఈ ఆరు ఆటల్లో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోవచ్చు. అన్ని సులభమైనవి, సరళమైన ఆటలే. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఈ ఆటలో ఓడిపోయినవారు పోటీ నుంచి శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. ఆటలోంచే కాదు, జీవితం నుంచే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఓడిపోతే చంపేస్తారని అర్థం. మొదటి ఆట ఆడితే కానీ ఈ విషయం వారికి తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆరు ఆటలను దిగ్విజయంగా పూర్తిచేసుకొని చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేది చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. కథనం వీక్షకుడికి ఊపిరాడనివ్వదు. చివరి దాకా ఉత్కంఠ రేపే కథనంతో థ్రిల్ గురిచేస్తుంది.
మోసం, త్యాగం....భావోద్వేగం
పోటీలో పాల్గొనే పోటీదారులకు వాస్తవ జీవితంలో గడ్డు పరిస్థితులుంటాయి. ప్రధాన పాత్రైన సియాంగ్ జీ హున్‌కి భార్యతో విడాకులు అవుతాయి. ఉద్యోగం పోతుంది. లెక్కలేనంత అప్పులు చేస్తాడు. దీనికి తోడు జూదం అతడికి వ్యసనం. అందులోనూ డబ్బులు పోగొట్టుకుంటాడు. రెండో వివాహం చేసుకున్న అతడి భార్య.. కూతురిని కూడా తనతో పాటే అమెరికా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంటుంది. కూతురిని తన సంరక్షణలోకి తెచ్చుకోడానికి డబ్బు కావాలి. అప్పు ఇచ్చినవాళ్ల నుంచి బెదిరింపులు, కూతురు తనకు దక్కదేమోనన్న భయం.. ఈ రెండు కారణాలతో ప్రమాదకరమైన ‘స్క్విడ్‌గేమ్’ ఆటలోకి అడుగుపెడతాడు. అక్కడ తన క్లాస్మేట్ సాంగ్ వూ కలుస్తాడు. ఒంటరిగా పోరాటం చేయడం కన్నా..కలిసి కట్టుగా ఆడితే విజయం సాధించొచ్చని అలీ, ఇల్ నామ్ ఇలా ఐదుగురు జట్టుగా ఏర్పడతారు. ఈ పోరాటంలో ఒకరికొకరు అండగా నిలబడతారు. కొన్నిసార్లు సొంతవాళ్లనే మోసం చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా స్నేహం, సహకారం, మోసం, త్యాగాలతో వెబ్ సిరీస్ ఆద్యాంతం భావోద్వేగాల ప్రయాణంలా సాగి చూసే ప్రేక్షకుడికి కళ్లని తడిపేస్తుంది. ఈ పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉండడం కూడా ఈ వెబ్ సిరీస్ విజయానికి మరో కారణం.
నిజజీవితంలోనూ ఉందా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన బిలియనీర్లు ఈ ఆటను వినోదం కోసం సృష్టించుకుంటారు. ఇందులో అప్పులపాలైన సామాన్యులే వారికి పావులు. డబ్బుల కోసం వాళ్లు కొట్టుకు చస్తుంటే.. అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు. కావాల్సినంత డబ్బు సంపాదించిన తర్వాత బోర్ కొట్టి ఇలాంటి హింసాత్మక పోటీని ఏర్పాటు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక రహస్య దీవిని ఎంచుకుంటారు. పోటీల కోసం విశాలమైన మైదానాలను అన్ని హంగులతో భారీగా నిర్మిస్తారు. తొలత ఎంతో అందంగా, స్వర్గంలో ఉన్నట్లు కనిపించే ఆ ప్రదేశం... ఆ తర్వాత పోటీదారుల నెత్తుటితో తడిసి నరకం కన్నా భయంకరమైన ప్రదేశంగా మారుతుంది. నిజం జీవితంలోనూ ఇలాంటి పోటీలు జరిగే అవకాశం లేకపోలేదని కొందరు భావిస్తున్నారు. దుబాయి లాంటి సంపన్న దేశాల్లో సామాన్యులను పావులుగా చేసి ఇదే తరహా ఆటలు ఆడిస్తారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు జరిగిన దాఖలాలైతే ఏమీ లేవు.
సమాజంలోని అంతరాలకి దృశ్య రూపం
పెట్టుబడిదారీ విధానంలోని వాస్తవ రూపాన్ని, దాని పర్యావసనాలను ఈ వెబ్‌సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపిందనడంలో సందేహం అక్కర్లేదు. సమాజంలోని అంతరాలను స్పష్టంగా చూపించడంలో నూటికి నూరు పాళ్లు విజయం సాధించింది. డబ్బుల కోసం సామాన్యులు కొట్టుకుచావడంలో.. ధనవంతులకు ఆనందం దొరుకుతుంది. ఈ కాన్సెప్ట్‌తోనే సమాజంలో వ్యత్యాసాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది బహిర్గతమవుతుంది. ఈ పోటీ ప్రపంచంలో పడి మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోతున్న మనుషుల నిజస్వరూపాన్ని కూడా తెరపై చూపించింది. అందుకే జనాలను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. దక్షిణ కొరియా సమాజంలోని నిజమైన అంతరాలను చూపించిందని పలు వెబ్సైట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ కొరియా సమాజంపైనే తీసిన ‘పారసైట్’కి గతేడాది ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్లో ముందే?
‘స్క్విడ్‌గేమ్’ విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు దీన్ని ఆస్కార్ చిత్రం ‘పారాసైట్’తో పోల్చుతున్నారు. ఈ సినిమాలాగే ‘స్క్విడ్‌గేమ్’ వెబ్‌సిరీస్ కూడా ఆర్థిక అసమానతల చుట్టూ అల్లుకున్న కథే. ఈ స్థాయి హింసాత్మక ఘటనలు పారసైట్లో ఉండవు. ‘ది గాడ్స్ విల్’ అనే జపాన్ సినిమాను కాపీ కొట్టారని ఆరోపణలు వచ్చాయి. వీటిని దర్శకుడు కొట్టిపారేశాడు. 2009 లోనే ఈ కథను రాసుకున్నట్లు స్పష్టం చేశాడు. బాలీవుడ్లో అదే ఏడాది(2009) ఇమ్రాన్ ఖాన్, శ్రుతిహాసన్, సంజయ్‌దత్ ప్రధానపాత్రల్లో ‘లక్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం కూడా అచ్చంగా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కడం విశేషం. ‘లక్’లోనూ జీవితం బోర్ అనిపించి కొందరు బిలియనీర్లు ఇలాంటి ప్రాణాంతక పోటీలనే నిర్వహిస్తారు. అప్పులపాలైన కొందరు ఈ నెత్తుటి పోటీల్లో పాల్గొంటారు. ఇది బాక్సాఫీసు వద్ద విఫలమైంది. బాలీవుడ్ ప్రేక్షకులు ఆ సమయానికి ఇలాంటి కథలను అంగీకరించే పరిస్థితిలో లేరు. రొమాంటిక్ లవ్ స్టోరీల కాలమది. అందుకే ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. కరోనా తర్వాత ఆర్థిక, మానసిక స్థితిగతుల్లో వచ్చిన మార్పుల కారణంగానే వీక్షకులను ‘స్క్విడ్‌గేమ్’ అమితంగా ఆకట్టుకుంటుందని కొందరి అభిప్రాయం. ఏది ఏమైన సరైన సమయంలో విడుదలైంది గనుకే ఈ స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలను బట్టి దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు క్లూ ఇచ్చాడు. ఒకవేళ సెకండ్ సీజన్ కూడా వస్తే మరింత సంచలనాలు సృష్టిస్తుందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..