
Cinema Titles: ‘ఖుషి’, ‘విక్రమ్’, ‘మేజర్’, ‘జనగణ మన’.. మళ్లీ వస్తున్నాయి!
ఇంటర్నెట్ డెస్క్: పవన్‌కల్యాణ్ ‘ఖుషి’, నాగార్జున ‘విక్రమ్’, చిరంజీవి ‘మేజర్’ సినిమాలు ఎప్పటివో కదా! మళ్లీ ఇప్పుడు రావడమేంటి? అని ఆలోచిస్తున్నారా!! ఆ పిక్చర్స్ కాదుగానీ వాటి పేర్లు మరోసారి వెండితెరపై కనిపించబోతున్నాయి. అదెలా అంటే.. కథా నేపథ్యం, అందులోని ముఖ్య పాత్ర తదితర విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్శకనిర్మాతలు తమ సినిమాకు సరిపోయే పేరును (కొత్తదైనా, పాతదైనా) ఎంపిక చేసుకుంటుంటారు. ఆయా అంశాల డిమాండ్ మేరకు దాన్నే టైటిల్‌గా రిజిస్టర్ చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే గతంలో వినిపించిన సినిమా పేర్లే మళ్లీ వినిపిస్తుంటాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరిన ‘ఖుషి’, ‘మేజర్’, ‘విక్రమ్’, ‘జనగణ మన’తో పాటు మరికొన్ని సినిమాలను గుర్తుచేసుకుందాం..
అప్పుడు పవన్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ
పవన్ కల్యాణ్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచే చిత్రాల్లో ‘ఖుషి’ ఒకటి. విజయ్ నటించిన తమిళ సినిమా ‘ఖుషి’కి రీమేక్‌గా అదే పేరుతో దర్శకుడు ఎస్.జె. సూర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌లోని పాటలు, పవన్- భూమిక మధ్య సాగే సన్నిశాలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఈ సూపర్ హిట్ సినిమా పేరును తమ చిత్రానికి పెట్టుకోవాలని చాలామంది ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఈ అవకాశం దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు దక్కింది. ఈ కాంబినేషన్లో విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి అదే పేరు ఖరారైంది. అలా 21 ఏళ్ల తర్వాత ‘ఖుషి’ మరోసారి తెరపై మెరవబోతుంది. ఈ కొత్త ‘ఖుషి’.. డిసెంబరు 23న విడుదలకానుంది.
అటు చిరంజీవి.. ఇటు అడివి శేష్
1996లో ‘సిపాయి’ అనే కన్నడ చిత్రం తెరకెక్కింది. రవిచంద్రన్, చిరంజీవి, సౌందర్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకు రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. 1998లో ‘మేజర్’ పేరుతో తెలుగులో విడుదలైంది. ఇప్పుడిదే పేరుతో అడివి శేష్ సినిమా రాబోతుంది. 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా రూపొందిన చిత్రమిది. జూన్ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. శశికిరణ్ తిక్కా దర్శకుడు.
నాగార్జున 1.. కమల్ 232
1986లో ‘విక్రమ్’ అనే సినిమాతో నాగార్జున హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఆ పేరు మళ్లీ మారుమోగుతోంది. కమల్‌హాసన్ నటించిన 232వ చిత్రానికి ఇదే పేరు పెట్టడం, అందులో ప్రముఖ నటులు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించడం ఇందుకు కారణమైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచారా చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ ముగ్గురిలో ‘విక్రమ్’ ఎవరా అనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మలయాళం.. పాన్ ఇండియా
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘జనగణ మన’. ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైంది. మరోవైపు, ఇదే పేరుతో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ఓ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఈ టైటిల్‌తో సినిమా చేస్తానని, అది తన కలల ప్రాజెక్టు అని ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కథ కోసం ముందుగా ఓ అగ్ర హీరోను అనుకోగా, చివరకు ఆ అవకాశం విజయ్ను వరించింది. ఈ చిత్రం 2023 ఆగస్టు 3న విడుదలకానుంది.
‘ఆడవాళ్లూ! మీకు జోహార్లు’ పేరుతో కృష్ణంరాజు హీరోగా 1981లో ఓ సినిమా వచ్చింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి అతిథిగా కనిపించారు. శర్వానంద్- రష్మిక జంటగా రూపొందిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఈ ఏడాది విడుదలైంది. కిశోర్ తిరుమల దర్శకుడు.
శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా బి. కిశోర్ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీకారం’. వ్యవసాయం గొప్పతనాన్ని చాటి చెప్పే కథ ఇది. ఇదే పేరుతో 1996లో జగపతి బాబు హీరోగా ఓ చిత్రం వచ్చింది. ఉమా మహేశ్వరరావు దర్శకత్వం వహించారు.
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. 1990లో విడుదలైంది. ఇదే పేరుతో కార్తికేయ హీరోగా దర్శకుడు శ్రీ సరిపల్లి తెరకెక్కించిన సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటి యువతకు ‘మహర్షి’ అంటే మహేశ్ బాబు గుర్తుకొస్తారు. అంతగా తన మేనియా చూపించారాయన. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇదే పేరుతో అలనాటి యువతను అమితంగా ఆకట్టుకున్న నటుడు రాఘవ. ఎంతగా అంటే తన ఇంటి పేరే ‘మహర్షి’గా మారేంత. వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1987లో విడుదలైంది.
‘గ్యాంగ్ లీడర్’గా 1991లో సంచలనం సృష్టించారు చిరంజీవి. ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. ఇదే టైటిల్‌తో నాని ఓ గ్యాంగ్ కథను తెరపైకి తీసుకొచ్చారు. దానికి కొంచెం మార్పు చేసి ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’గా నామకరణం చేశారు. ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకుడు.
దర్శకుడు కోదండరామిరెడ్డి- కథానాయకుడు చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బ్లస్టర్ చిత్రం ‘ఖైదీ’. ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. ఇదే పేరుతో కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ ఓ చిత్రం తెరకెక్కించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళనాట సంచలనం సృష్టించింది.
1998లో తన ‘తొలిప్రేమ’ను పరిచయం చేశారు పవన్ కల్యాణ్. ఈ చిత్రాన్ని కరుణాకరన్ తెరకెక్కించారు. ఇదే టైటిల్‌తో వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి 2018లో ఓ చిత్రాన్ని విడుదల చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు-లారీ ఢీ: ఒకరు మృతి, 20 మందికి గాయాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- కథ మారింది..!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!