Ram Charan: పేరు అదేనా?

రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అడ్వాణీ కథానాయిక.

Updated : 09 Mar 2023 06:52 IST

రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. శంకర్‌ మార్క్‌ భారీతనంతోపాటు... సామాజిక అంశాలు ప్రధానంగా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఓ కొత్త కబురుని వినిపించేందుకు చిత్రబృందం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఉగాది సందర్భంగా ఈ నెల 22న కానీ లేదంటే, రామ్‌చరణ్‌ పుట్టినరోజైన ఈ నెల 27న కానీ సినిమా పేరుని ప్రకటించే అవకాశాలున్నట్టు తెలిసింది. పలు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ తాజాగా ‘సి.ఇ.ఓ’ (CEO) అనే పేరు గట్టిగా వినిపిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా కాబట్టి, అన్ని భాషలకి తగ్గట్టుగా ఈ పేరుని ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. సినిమాలో కథానాయకుడు రామ్‌చరణ్‌ ఓ యువ ఐఏఎస్‌ అధికారిగా సందడి చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని