Pushpa 2: రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా పుష్ప 2

‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో పుష్పరాజ్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇదే పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నారు అల్లు అర్జున్‌.

Published : 13 Jun 2024 00:48 IST

‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో పుష్పరాజ్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇదే పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నారు అల్లు అర్జున్‌. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ‘పుష్ప 2’తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సీన్లను తెరకెక్కిస్తోంది చిత్రబృందం. అల్లు అర్జున్‌తో ఇతర పాత్రధారులపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని