Published : 13 Jun 2022 11:23 IST

Squid Game 2: గ్రీన్‌ లైట్‌.. రెడ్‌ లైట్‌.. ఆ గేమ్‌ మళ్లీ వచ్చేస్తోంది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘స్క్విడ్‌ గేమ్‌’.. వినడానికి చిన్నపిల్లల ఆటలా ఉన్నా చూసే ప్రేక్షకుడిని ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసిన సిరీస్‌ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో గతేడాది విడుదలైన ఈ కొరియన్‌ సిరీస్‌.. కొన్ని రోజుల్లోనే 111 మిలియన్ల వ్యూస్‌తో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కొంతమందిని సెలక్ట్‌ చేసుకుని, డబ్బు ఆశ చూపి వారందరి ప్రాణాలతో ఓ వ్యక్తి ఆడే ఆటగా దీన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిలో చూడాలనే ఉత్సుకత రేకెత్తించేలా చేసింది. ముఖ్యంగా ఈ ఆటలో ఉండే ప్రతిరౌండ్‌ ఒకెత్తు అయితే మొదటి రౌండ్‌.. ‘గ్రీన్‌ లైట్‌.. రెడ్‌ లైట్‌’ వేరే లెవల్‌లో ఉంటుంది.

కాగా, ఇప్పుడిదే సిరీస్‌కు కొనసాగింపుగా ‘స్క్విడ్‌ గేమ్‌-2’ రూపొందిస్తున్నట్లు ఆ సిరీస్‌ దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్‌ మరింత కొత్తగా.. ప్రతి క్షణం ఉత్కంఠకు గురి చేసేలా ఉండనున్నాయని తెలిపారు. ‘‘స్క్విడ్‌ గేమ్‌’కి ప్రాణం పోసి ఓ సిరీస్‌గా గతేడాది మీ ముందుకు తీసుకురావడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ, ఎన్నడూ లేని విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్‌ పాపులర్‌ షోగా ‘స్క్విడ్‌ గేమ్‌’ పేరు తెచ్చుకోవడానికి కేవలం 12 రోజులు మాత్రమే సమయం పట్టింది. ‘స్క్విడ్‌ గేమ్‌’కు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఇక, ఇప్పుడు జి-హన్‌ రిట్నర్స్‌.. ది ఫ్రెంట్‌ మేన్‌ రిట్నర్స్‌.. సీజన్‌-2 వచ్చేస్తోంది. ఆ సూట్‌ ధరించి గేమ్‌ ప్రారంభించే డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. CHEOL-SU (మరబొమ్మ) బాయ్‌ఫ్రెండ్‌ యోంగ్‌ హి ఈసారి మీ ముందుకు రానున్నాడు. మరో సరికొత్త గేమ్‌ కోసం మాతో జట్టు కట్టండి’’ అని ఆయన రాసుకొచ్చారు. అయితే ఈ సిరీస్‌ ఎప్పుడు విడుదల కానుందనేది తెలియాల్సి ఉంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని