Sravana Bhargavi: నాలుగేళ్ల విరామం.. ‘లైగర్‌’తో అలరించనుంది..!

‘సింహమంటి చిన్నోడే’ అంటూ సిల్వర్‌ స్క్రీన్‌పై తన వాయిస్‌తో మేజిక్‌ చేశారు గాయని శ్రావణ భార్గవి (Sravana Bhargavi). రేడియో జాకీగా కెరీర్‌ ఆరంభించిన ఆమె సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ....

Updated : 16 Aug 2022 09:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సింహమంటి చిన్నోడే’ అంటూ సిల్వర్‌ స్క్రీన్‌పై తన వాయిస్‌తో మ్యాజిక్‌ చేశారు గాయని శ్రావణ భార్గవి (Sravana Bhargavi). సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బుల్లితెర వేదికగా నిర్వహించిన పలు సంగీత కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. తన తొలిపాట సూపర్‌హిట్‌ కావడంతో అవకాశాలు వరుస కట్టాయి. చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్‌, మిక్కీ జె మేయర్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఇలా స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లతో కలిసి అగ్ర, యువ హీరోల సినిమాల్లో తన గాత్రాన్ని వినిపించారు. సింగర్‌ గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ ఆమె అలరించారు.

‘గబ్బర్‌సింగ్‌’, ‘ఈగ’, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాల్లో కథానాయికలకు శ్రావణ భార్గవి వాయిస్‌ అందించారు. కెరీర్‌లో రాణిస్తున్న తరుణంలోనే గాయకుడు హేమచంద్రను వివాహం చేసుకున్న ఆమె.. పెళ్లి తర్వాత కూడా ఎన్నో పాటలు పాడారు. 2018లో విడుదలైన ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత శ్రావణ భార్గవి కెరీర్‌ నుంచి సుమారు నాలుగేళ్లు విరామం తీసుకున్నారు. త్వరలో విడుదల కానున్న ‘లైగర్‌’తో ఆమె మళ్లీ గాయనిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. నేడు శ్రావణ భార్గవి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆలపించిన పలు సూపర్‌హిట్స్‌ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం..!









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని