Sree Leela: విజయోత్సాహంతో సెట్లోకి అడుగులు

చేతి నిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది నటి శ్రీలీల. వరస అవకాశాలతో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది.

Updated : 07 Jan 2023 07:07 IST

చేతి నిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది నటి శ్రీలీల (Sree Leela). వరస అవకాశాలతో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఇటీవలే ‘ధమాకా’తో తొలి కమర్షియల్‌ హిట్‌ను అందుకున్న ఈ నాయిక ఇప్పుడు కథానాయకుడు రామ్‌ (Ram) చిత్రం కోసం రంగంలోకి దిగింది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర సెట్లోకి శ్రీలీల అడుగు పెట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. రామ్‌, శ్రీలీలకు మధ్య సాగే కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది. ‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలతో నిండిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రామ్‌ మాస్‌ పాత్రలో సరికొత్తగా కనిపిస్తారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని