
Updated : 25 Jan 2022 12:22 IST
sree leela: అనగనగా ఓ రాణి
నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ‘అనగనగా ఒక రాజు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం కథానాయికగా శ్రీలీల ఎంపికైనట్టు సమాచారం. ‘పెళ్లిసందడి’తో ప్రేక్షకుల్ని అలరించిన కథానాయిక శ్రీలీల. కొత్త సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తోంది. తాజాగా నవీన్ పొలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటించేందుకూ ఆమె పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది.
Tags :