
Published : 20 Jan 2022 16:21 IST
Arjuna Phalguna: ఆహాలో ‘అర్జున ఫల్గుణ’.. ట్రైలర్ చూశారా?
హైదరాబాద్: కాన్సెప్ట్ బేస్డ్ కథలతో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు నటుడు శ్రీవిష్ణు. ‘రాజ రాజ చోర’ విజయం తర్వాత ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్గా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి ‘అర్జున ఫల్గుణ’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈసినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా నటి అమృతా అయ్యర్ నటించారు.
Tags :