Bhala Thandhanana Review: రివ్యూ: భళా తందనాన
Bhala Thandhanana Review: శ్రీ విష్ణు, కేథరిన్ కీలక పాత్రల్లో నటించిన ‘భళా తందనాన’ ఎలా ఉందంటే?
Bhala thandhanana review: నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్, గరుడ రామ్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి, సత్య తదితరులు; సంగీతం: మణి శర్మ; సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు; ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్; కథ, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా; నిర్మాత: రజని కొర్రపాటి; బ్యానర్: వారాహి చలన చిత్రమ్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చైతన్య దంతులూరి; విడుదల: 06-05-2022
పరాజయాలు ఎదురైనా కొత్త రకమైన కథలతోనే సినిమాలు చేస్తున్న కథానాయకుడు శ్రీవిష్ణు(Sree vishnu). అందుకే ఆయన సినిమాపై కథల పరంగా ప్రత్యేకమైన అంచనాలు ప్రేక్షకుల్లో కనిపిస్తుంటాయి. ఈసారి ‘భళా తందనాన’ (Bhala thandhanana review) అంటూ ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరితో కలిసి సినిమా చేశారు. ఈ కలయికతోపాటు... ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహిచలన చిత్రంలో రూపొందడంతో సినిమా విడుదలకి ముందే ఆసక్తిని రేకెత్తించింది. మరి అందుకు తగ్గట్టుగా ఉందా?(Bhala thandhanana review) శ్రీవిష్ణు సారి ఎలాంటి పాత్ర చేశారు?
కథేంటంటే: చందు అలియాస్ చంద్రశేఖర్ (శ్రీవిష్ణు) ఓ అనాథాశ్రమంలో అకౌంటెంట్. అనుకోకుండా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన శశిరేఖ (కేథరిన్)(Catherine)ని కలుస్తాడు. ఇద్దరూ దగ్గరయ్యే క్రమంలోనే కొన్ని వరుస హత్యలు జరుగుతాయి. దాని వెనక హవాలా కింగ్ ఆనంద్ బాలి (రామచంద్రరాజు) ఉన్నాడని తెలుస్తుంది. హత్యకి గురవుతున్న వ్యక్తుల్ని తాను చూశానని కూడా చెబుతాడు చందు. ఆ హత్యోదంతాల్ని పరిశోధించే క్రమంలో శశిరేఖకి ఎలాంటి విషయాలు తెలిశాయి? హవాలా కింగ్ దగ్గరున్న రూ.2 వేల కోట్ల డబ్బు దొంగతనం చందు మెడకి చుట్టుకున్నాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?ఇంతకీ ఆ రూ.2 వేల కోట్లతో అతనికి సంబంధం ఉందా లేదా? (Bhala thandhanana review)తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రమిది. ఈ కథకి హాస్యంతో పాటు, ప్రేమని కూడా జోడించారు. ఆరంభ సన్నివేశాలు నాయకా నాయికల పాత్రల్ని, వారి ప్రపంచాల్ని పరిచయం చేస్తూ సాగుతాయి. అలా కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయమే తీసుకున్నాడు దర్శకుడు. రాజమండ్రి, కాకినాడ మధ్య ముల్లంగి అంటూ కథానాయకుడు తన ఫెయిల్యూర్ ప్రేమకథని చెప్పినా అదంతా కాసిన్ని నవ్వులు పంచడానికే. కథ వేగం పుంజుకునేది మాత్రం వరుస హత్యల తర్వాతే. (Bhala thandhanana review) విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు, అక్కడ మలుపులు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ద్వితీయార్ధంలోనే అసలు కథ మొదలవుతుంది.
తన రూపాయి కోసం లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టే ప్రతినాయకుడు కథలోకి ఎంట్రీ ఇవ్వడంతో పోరాటం రక్తి కడుతుంది. 25 చోట్ల ఉండే హవాలా డబ్బుని ఒక చోటకి చేరేలా చేయడం, అక్కడ్నుంచి దాన్ని మాయం చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. (Bhala thandhanana review) విభిన్నమైన కథ, దానికి తగినట్టుగా మలుపులతో కూడిన కథనమే కుదిరింది. కానీ, నేర నేపథ్యంతోపాటు, థ్రిల్లర్ అంశాలకి చోటున్న ఈ కథని ఇంటెన్స్‌గా తీయకుండా... అందులోకి హాస్యం, ప్రేమ, పాటల్ని జోడించడంతో కథలో బిగి తగ్గినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించే ప్రత్యేకమైన కథ, కథనాలున్నప్పటికీ సగటు సినిమా అనిపిస్తుంది. అసలు కథానాయకుడి గతం ఏమిటి?డబ్బు ఎక్కడుంది? అనే అంశాల్ని దాచేస్తూ రెండో భాగం కూడా ఉందంటూ కథని ముగించారు దర్శకుడు. (Bhala thandhanana review) అక్కడక్కడా నిదానంగా సాగే సన్నివేశాల్ని భరిస్తే కాలక్షేపానికి మాత్రం ఢోకా ఉండదు.
ఎవరెలా చేశారంటే: శ్రీవిష్ణు(Sree vishnu) తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రథమార్ధంలో అమాయకమైన యువకుడిగా కనిపించిన తీరు మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో ఆయన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ నటించిన తీరు రక్తి కట్టిస్తుంది. కేథరిన్ (Catherine)బొద్దుగా కనిపించినా జర్నలిస్ట్‌గా చక్కటి అభినయం ప్రదర్శించింది. మీ తెలుగు ఇంగ్లిష్లా ఉంటుందని సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌కి న్యాయం చేకూరుస్తూ తెలుగుని ఇంగ్లిష్లా పలుకుతూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది కేథరిన్. రామచంద్రరాజు, పోసాని కృష్ణమురళి ప్రతినాయక పాత్రల్లో నటించిన తీరు మెప్పిస్తుంది. సత్య ప్రథమార్ధంలో నవ్విస్తాడు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మణిశర్మ సంగీతం, సురేష్ రగుతు కెమెరా పనితనం మెప్పిస్తుంది.(Bhala thandhanana review) ‘బాణం’లాంటి ఇంటెన్సిటీ ఉన్న సినిమాని తీర్చిదిద్దిన దర్శకుడు తన శైలికి భిన్నంగా అన్ని అంశాల్ని జోడించి తీశారు.
బలాలు
+ కథ, కథనం
+ నటీనటులు
+ పతాక సన్నివేశాలు
బలహీనతలు
- సాగదీతగా అనిపించే సన్నివేశాలు
- కథనంలో గాఢత తగ్గడం
చివరిగా: ‘భళా తందనాన’... కాలక్షేపం కోసం(Bhala thandhanana review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?