Sree Vishnu: ‘అల్లూరి’ మార్నింగ్‌ షోలు రద్దు.. మ్యాట్నీ నుంచి ఇక మీ చేతుల్లోనే : శ్రీవిష్ణు ట్వీట్‌

విభిన్నమైన కథలు, పాత్రలతో తరచూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం...

Updated : 23 Sep 2022 13:16 IST

హైదరాబాద్‌: విభిన్నమైన కథలు, పాత్రలతో తరచూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం ‘అల్లూరి’ (Alluri). ప్రదీప్‌ వర్మ దర్శకుడు. పోలీస్‌ వ్యవస్థ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీవిష్ణు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అనుకోని కారణాల వల్ల ‘అల్లూరి’ మార్నింగ్‌ షోలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రద్దు చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ శ్రీవిష్ణు తాజాగా ట్వీట్‌ చేశారు. ‘‘కొన్ని కారణాల వల్ల ‘అల్లూరి’ మార్నింగ్‌ షోలను మీ ముందుకు తీసుకురాలేకపోయాం. మ్యాట్నీ నుంచి మీదే.. ఇక మీ చేతుల్లోనే’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ చూసిన పలువురు నెటిజన్లు ‘ఎందుకు రద్దు చేశారన్నా’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. షోలు రద్దు కావడంతో పలువురు సినీ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని