స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్‌ గీతం

శర్వానంద్‌ కథానాయకుడుగా బి.కిశోర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్‌ నాయిక. వ్యవసాయం ప్రధానాంశంగా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 11న విడుదలవుతుంది.

Updated : 27 Feb 2021 12:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌ కథానాయకుడుగా బి.కిశోర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్‌ నాయిక. వ్యవసాయం ప్రధానాంశంగా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 11న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో టైటిల్‌ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా ఈ పాట(లిరికల్‌ వీడియో) విడుదలైంది.

‘శ్రీకారం కొత్త సంకల్పానికి.. కలలు చిగురిస్తున్న సంతోషం ఇది, శ్రీకారం కొత్త అధ్యాయానికి.. చిగురు పరిమళమల్లె దీవిస్తున్నదీ పుడమి’ అంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేదిగా ఉంది. వ్యవసాయం మనకు కొత్త కాదు మన తాతల కృషి.. జీన్స్‌ వేసుకున్నా ఆ కళ మన జీన్స్‌లో ఉంది అంటూ సాహిత్యంతో యువతలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు రచయిత రామజోగయ్య శాస్త్రి. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటను పృథ్వీ చంద్ర చక్కగా ఆలపించారు.  రావు రమేశ్‌, ఆమని, నరేశ్‌, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు