Sreeleela: నేను మొదటి నుంచి బాలకృష్ణకు వీరాభిమానిని: శ్రీలీల
ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో నటిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది హీరోయిన్ శ్రీలీల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బాలకృష్ణకు వీరాభిమానినని చెప్పింది.
హైదరాబాద్: అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల (Sreeleela). తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్‌ను సొంతం చేసుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ముందు వరసలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ‘ధమాకా’ సినిమాలో తన నటనతో, డాన్స్‌తో అదరగొట్టిన ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బిజీ షెడ్యూల్ గురించి తెలిపింది. తానెంతో ఆనందంగా ఉన్నానని చెప్పిన శ్రీలీల ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చెస్తానని తెలిపింది.
‘‘ఓ మంచి సినిమా ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రుచుల మిశ్రమంలాగా సినిమా కూడా అన్ని భావోద్వేగాలను కలిగి ఉంటుంది. సంవత్సరమంతా బాగుండాలని మా అమ్మ ఉగాది రోజు బెల్లం ముక్కతో నా నోరు తీపి చేస్తుంది. నాకు ఎప్పుడూ జనాల మధ్య ఉండడం చాలా ఇష్టం. అదృష్టవశాత్తు నేను ఈ రంగంలోకి వచ్చాను. మొదటి నుంచే నేను బాలకృష్ణ (Balakrishna)కు వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించడం మొదలుపెట్టాక ఇంకా పెద్ద అభిమానిని అయ్యాను. ఆయనది అంత గొప్ప వ్యక్తిత్వం. ఆయనతో కలిసి సీన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. డైలాగ్ విషయంలో ఎలాంటి తప్పులు చెయ్యకుండా అప్రమత్తంగా ఉంటాను. ఈ సినిమాలో నా పాత్ర గురించి తెలుసుకోవాలని అంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. నా క్యారెక్టర్ గురించి తెలిశాక అందరూ ఆశ్చర్యపోతారు’’ అని చెప్పింది.
అలాగే తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ..‘‘ ప్రస్తుతం నేను చాలా కొత్త ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నాను. వాటిలో మహేష్ (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram)ల సినిమా ఒకటి. నేను ఈ సినిమా కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. అలాగే రామ్ పోతినేని (Ram Pothineni), నవీన్ పొలిశెట్టి, వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej)ల సినిమాలకు కూడా సైన్ చేశాను. ఏ సెట్‌లో ఉన్నానో కూడా గుర్తులేనంత బిజీగా గడుపుతున్నాను. ఒక నటిగా నాకు ఇంతకంటే ఏం కావాలి’’ అంటూ తన ఆనందాన్ని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం