Sree Simha: ‘ఉస్తాద్‌’గా రానున్న శ్రీసింహ

‘మత్తువదలరా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోగా శ్రీసింహ . ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యంగ్‌ హీరో తాజా చిత్రం ‘ఉస్తాద్‌’.

Updated : 24 Nov 2022 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మత్తువదలరా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ సింహ. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా.. మంచి నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యంగ్‌ హీరో తాజా చిత్రం ‘ఉస్తాద్‌’. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి తదితరులు హాజరయ్యారు. వారాహి చలన చిత్రం, కృషి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేశ్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫణిదీప్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అకీవా.బి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఏజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు